HC orders police to file case against TDP MLA బోండా ఉమాపై కేసు నమోదుకు హైకోర్టు అదేశం..

High court orders vijayawada police to file case against tdp mla

sai sri, suma sri, sai sri death, Andhra pradesh High court, vijayawada central constituency, bonda umamaheswara rao, TDP MLA, madamshetty shivakumar, sensational comments, andhra pradesh, politics

Andhra Pradesh High court orders vijayawada police to file case against TDP MLA Bonda UmaMaheswara Rao today after hearing a petition filed by sumasri who alleges that the mla and her husband are responsible for her daughter saisri death.

బోండా ఉమాపై కేసు నమోదుకు హైకోర్టు అదేశం..

Posted: 04/09/2019 05:21 PM IST
High court orders vijayawada police to file case against tdp mla

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బోండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. తన కూతురు మరణానికి సంబంధించి అమె తల్లి బాధితురాలు హైకోర్టును ఆశ్రయించి పిటీషన్ వేశారు. తన కుమార్తె సాయిశ్రీ మరణానికి కారణం.. భర్త మాదంశెట్టి శివకుమార్, బోండాఉమా మహేశ్వరరావు, అతని అనుచరులే కారణం అని 2017 ఏప్రియల్ లో సుమశ్రీ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే అప్పట్లో అధికార పార్టీ ఒత్తిడులకు తలొగ్గిన పోలీసులు కేసు నమోదు చేయకపోవటంతో ఆమె హైకోర్టును ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేసింది. బాధితురాలి పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఈ కేసులో బాధితురాలి అబియోగాలను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదంటూ పోలీసులను ప్రశ్నించింది. వెంటనే విజయవాడ సెంట్రల్ నియోజకవరగం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని అదేశాలను జారీ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది.

ఆర్డర్ కాపీతో సుమశ్రీ విజయవాడ పోలీస్ కమిషనర్ ను కలిసారు. ఆయన సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ కు కేసు రిఫర్ చేసారు.  కాగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన సుమశ్రీ కి చుక్కెదురైంది.  సిఐ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా, కేసు నమోదులో పోలీసులు జాప్యం చేస్తున్నారని, మాదంశెట్టి శివకుమార్,  బోండా ఉమామహేశ్వరరావు వల్ల తనకు ప్రాణ హని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suma sri  bonda umamaheswara rao  TDP MLA  AP HIgh Court  andhra pradesh  politics  

Other Articles