BJP, Congress trying to defeat me says kavitha తన గెలుపుపై కవిత సంచలన వ్యాఖ్యలు

Bjp skips turmeric board in manifesto nizamabad mp kavitha

Kavitha, Nizamabad, jagithyal, press meet, koppula eeshwar, KTR, KCR, TRS, BJP, Narendra Modi, Rahul Gandhi, Telangana CM, Congress, Telangana, politics

Why BJP didn’t mention Turmeric Board in its manifesto, questions Nizamabad sitting MP Kalvakuntla Kavitha, while asserting that only TRS can achieve it for the turmeric farmers.

చర్చనీయాంశంగా మారిన కల్వకుంట కవిత వ్యాఖ్యలు

Posted: 04/09/2019 11:52 AM IST
Bjp skips turmeric board in manifesto nizamabad mp kavitha

దేశంలో ప్రధాని మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ వైపు లోక్ సభ ఎన్నికలలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న తరుణంలో.. నిజామాబాద్‌ లో లోక్ సభ నియోజకవర్గంలో తనను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో బీజేపీ, కాంగ్రెస్ లు ఏకమయ్యాయని, రెండు జాతీయ పార్టీలూ ఒకటై, తనను టార్గెట్ చేశాయని ఆయన సోదరి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ - బీజేపి పార్టీలకు లోక్ సభ ఎన్నికలలో ఎలాగైనా బుద్ది చెప్పాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య వున్న వైరాన్ని పక్కనబెట్టి మరీ అమెను ఓడించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని కవిత వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాలలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. కుటిల యత్నాలు చేసినా చివరకు గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు.

గత ఐదేళ్లలో బీజేపీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని ఆరోపించిన కవిత, పసుపు బోర్డు ఇచ్చేందుకు కావాల్సినంత అధికారం బీజేపీ వద్ద ఉందని, అయినా, రైతుల గోడును పట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి పసుపు బోర్డును ఇస్తామని చెబుతున్నారని, వారి మాటలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ఆర్మూర్ సభలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న బీజేపి నేతలు.. మేనిపెస్టోలో ఎందుకు ఆ హామీని పోందుపర్చలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లేయాలని కోరారు. బీజేపీ చెబుతున్న తప్పుడు హామీలను యువత నమ్మరాదని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kavitha  Nizamabad  KTR  KCR  TRS  BJP  Narendra Modi  Rahul Gandhi  Congress  Telangana  politics  

Other Articles