jaipal reddy says trs and bjp drama before elections ‘‘టీఆర్ఎస్, బీజేపి ఇక్కడ కుస్తీ.. అక్కడ దోస్తీ’’

Jaipal reddy questions why it raids not done on telangana ministers

s Jaipal reddy on TRS BJP, Jaipal reddy on IT raids on Telangana Ministers, Jaipal reddy on TRS BJP drama, Jaipal reddy on TRS BJP Tie Up, Jaipal reddy on TRS, Jaipal reddy on BJP, Lok sabha Elections, PM naredna modi, KCR, Congress, Telangana, politics

Former union minister s Jaipal reddy critisizes both ruling parties at center and the state for doing drama just in front of elections. He also questions why there are not IT raids on TRS ministers.

‘‘టీఆర్ఎస్ మంత్రుల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగడం లేదు.?’’

Posted: 04/08/2019 10:14 PM IST
Jaipal reddy questions why it raids not done on telangana ministers

అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో వున్న బీజేపి, టీఆర్ఎస్ పార్టీలు ప్రజల ముందు కొత్త నాటకానికి తెరతీసాయని కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి విమర్శించారు. ఈ రెండు పార్టీల తీరు చూస్తావుంటే.. కేంద్రంలో మైత్రి.. రాష్ట్రంలో కుస్తీ అన్నట్లుగా వుందని, అయితే ప్రజల ముందు మాత్రం కొత్త డ్రామాకు తెరతీసి ఒకరిపై మరోకరు అరోపణలు చేసుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు విమర్శించడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి ప్రశ్నించారు.

ఇవాళ కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ దేశంలోని బీజేపీయేతల ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఐటీ దాడులు జరుగుతున్నాయని అన్నారు. మనం చూస్తేనే వున్నాం మన పోరుగునున్న కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఐటీ దాడులు విపరీతంగా జరుగుతున్నాయని జైపాల్ రెడ్డి అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేసిన కేంద్రం ఎక్కడికక్కడ ఆదాయపన్ను శాఖ అధికారులతో దాడులకు పురిగోల్పుతూనే వుందన్నారు.

కాగా అని పార్టీల నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణలోని కేసీఆర్‌పై కానీ, తెలంగాణ మంత్రులపై కానీ.. కనీసం తెలంగాణ ఎమ్మెల్యేలపై కూడా ఎందుకు ఐటీ దాడులు చేయించడం లేదని ప్రశ్నించారు. మోడీ-కేసీఆర్‌ బంధం హైదరాబాద్‌లో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. మిగులు బడ్జెట్ తో వున్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారన్న జైపాల్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక కేసీఆర్‌కు అహంభావం పెరిగిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  BJP  TRS  S Jaipal Reddy  IT raids  Telangana Ministers  Telangana  politics  

Other Articles