pawan kalyan sensational comments on Actor Ali అలీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏదీ స్నేహం..

Pawan kalyan critisizes comedian ali for decieving him

pawan kalyan critisizes comedian ali, pawan kalyan on ali, pawan kalyan critisizes actor ali, pawan kalyan critisizes ali, pawan kalyan slams Ali, pawan kalyan lashes put on Ali, pawan kalyan, janasena, pulivendula, dalits, barbaric custom, Andhra Pradesh, Politics

Actor turned Politician pawan kalyan finally opened up about his friend and comedian Ali on joining YSRCP party. Power star says he decieved him.

అలీపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏదీ స్నేహం..

Posted: 04/08/2019 08:05 PM IST
Pawan kalyan critisizes comedian ali for decieving him

వైసీపీ నేత, సినీ నటుడు అలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అలీ వైసీపీలో చేరడంపై ప్రశ్నించిన మీడియాకు వ్యక్తులకు తమ ఇష్టమైన పార్టీల్లో చేరే స్వేచ్ఛ వుంటుందన్న.. ఇక వారి ఉధ్దేశ్యంలో వారికి ఏది బలమైన పార్టీ అయితే అందులో చేరుతారని అన్నారు. అయితే తాజగా అలీ లాంటి వ్యక్తుల వల్ల మనుషులపైనే నమ్మకం పోతుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రిలోని కోటిపల్లికి చేరుకున్న పవన్ కల్యాణ్ బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలి లాంటి స్నేహితుల వల్ల తనకు మనుషలపై నమ్మకమే పోతుందన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అలీకి అండగా ఉన్నానని... తనతో కలసి పనిచేస్తానని చెప్పిన అలీ, తనను వదిలి వైసీపీలోకి వెళ్లాడని అన్నారు. స్నేహమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. అలీలాంటి వాళ్ల వల్ల ఎవర్ని నమ్మల్లో ఎవర్ని నమ్మకూడదో కూడా తెలియక కష్టమవుతుందన్నారు.

అవసరంలో ఆదుకున్న అలీనే వదిలేసి వెళ్లిపోతే... ఇంకెవరిని నమ్మాలని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రజలను తప్ప బంధువులను, మిత్రులను నమ్మలేకపోతున్నానని చెప్పారు. అలీని వైసీపీ నేతలు వాడుకుంటున్నారని... ఆ ఇప్పటికైనా ఈ నిజాన్ని గ్రహించాలని సూచించారు. ఎంపీ టికెట్ ఇస్తామంటే వైసీపీలో అలీ చేరాడని చెప్పారు. అయితే ఎంపీ టికెట్ ఇవ్వకుండా అలి చేత పార్టీ ప్రచారాన్ని మాత్రం చేయించుకుంటున్నారని అన్నారు.

తన తండ్రి వైయస్సార్ శవం కూడా దొరక్కముందే సీఎం అయ్యేందుకు జగన్ ప్రయత్నించారని... అలాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని పవన్ ప్రశ్నించారు. వైయస్ బావమరిది రవీంద్రారెడ్డి సినిమా తీయాలని తనను బెదిరించారని... బెదిరిస్తే తోలు తీస్తానని హెచ్చరించానన్నారు. తాను రాజకీయాల్లో రాణించలేనని ఎలా అంటారని... తాను స్టార్ హీరోని అవుతానని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  comedian ali  YSRCP  decieve  back stab  Andhra Pradesh  Politics  

Other Articles