SC directs EC to raise random sampling of EVMs using VVPAT ఈవీఎంలను వీవీపాట్ స్లిప్పులతో సరిపోర్చాల్సిందే..: సుప్రీంకోర్టు

Vvpat verification sc orders counting of paper slips of five evms in every constituency

Supreme Court, VVPAT, EVM, Lok Sabha elections, elections, VVPAT slips, VVPAT verification, what is VVPAT, ECI, Election Commission, Opposition parties EVMs, EVM VVPAT, VVPAT full form, 2019 general elections

The Supreme Court ordered that Voter Verified Paper Audit Trail slips of five electronic voting machines in every constituency should be counted instead of just one EVM in the upcoming elections, Bar and Bench reported.

ఈవీఎంలను వీవీపాట్ స్లిప్పులతో సరిపోర్చాల్సిందే.. అన్నీకాదు.. : సుప్రీంకోర్టు

Posted: 04/08/2019 03:32 PM IST
Vvpat verification sc orders counting of paper slips of five evms in every constituency

దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ పద్దతి అపహాస్యం అవుతుందని అక్రమమార్గాలతో ప్రజాతీర్పును కొన్ని పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని అరోపణలు వచ్చిన నేపథ్యంలో దేశంలోని పలు రాజకీయ పార్టీలు దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టాయి. దీంతో ఆయా పార్టీల పిటీషన్లపై విచారణ అనంతరం ఇవాళ దేశ అత్యన్నత న్యాయస్థానం తన అదేశాలను వెలువరించింది. సుమారు 11 ప్రతిపక్ష పార్టీలు కనీసం యాబై శాతం మేర వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

అయితే ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంచుకున్న ఒక ఈవీఎంకు అటాచ్ చేసిన వీవీప్యాట్ లలోని ఓట్ల ప్రింటవుట్లను లెక్కిస్తుండగా, ఒకటికి బదులుగా ఐదు వీవీప్యాట్లలోని స్లిప్ లను లెక్కించి, ఈవీఎంలు, వీవీప్యాట్ లను సరిపోల్చాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే పార్లమెంటు నియోజక వర్గాల విషయానికి వస్తే, ఆయా నియోజకవర్గాల్లోని మొత్తం వీవీప్యాట్ లలో 35 ఈవీఎంల వీవీ ప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో సరిపోల్చి చూసుకోవాలని తేల్చి చెప్పింది.

విపక్షాలతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై వాదనలు విన్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని బెంచ్, ఈ మేరకు తీర్పిచ్చింది. అయితే యాభై శాతం మేర వీవీఫ్యాట్ లను లెక్కించి చూడాలన్న ప్రతిపక్షాల పిటీషన్లపై ఈసీ, ప్రతిపక్షాల మధ్య సాగిన వాదోపవాదాలను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఎన్నికల విధానంపై ప్రజలు, రాజకీయ పార్టీలకు మరింత విశ్వసనీయత కలగాల్సి వుందని, అందువల్ల ప్రతి నియోజకవర్గం నుంచి ర్యాండమ్ గా ఎంపిక చేసిన వీవీ ప్యాట్ మెషీన్లను ఓపెన్ చేసి, వాటిల్లోని స్లిప్ లను సరిచూసిన తరువాతనే ఫలితాలను వెల్లడించాలని ఈ సందర్భంగా రంజన్ గొగొయ్ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  VVPAT  EVM  Lok Sabha elections  Election Commission  Opposition parties  

Other Articles