Sujana Chowdary Linked Company Assets Attached By ED గుల్లైన సుజనా చౌదరి డొల్ల కంపెనీ..

Tdp mp sujana chowdary linked company assets attached by ed

YS Chowdary shell companies, ys chowdary shell companies ED attachment, sujana shell companies assets attached, Sujana shell company assets Rs 315 crore attach, Enforcement Directorate, ys chowdary, ys chowdary ed, ed attaches 315 crore assets, telugu desam party, andhra pradesh, politics

The Enforcement Directorate said it has attached assets worth Rs 315 crore in connection with a money laundering and alleged bank fraud case against a firm promoted by TDP MP YS Chowdary.

సుజనా చౌదరి డొల్ల కంపెనీ గుల్ల.. వందల కోట్ల అస్తుల అటాచ్..

Posted: 04/03/2019 02:48 PM IST
Tdp mp sujana chowdary linked company assets attached by ed

టీడీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. సుజనా కంపెనీల్లో గత కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఈడీ ‘సుజనా గ్రూప్‌’కు డొల్ల కంపెనీల భరతం పడుతోంది. డొల్ల కంపెనీల మాటున బ్యాంకుల నుంచి పోందిన రుణాలను మళ్లించిన తీరును కూడా అధ్యయనం చేసిన ఈడీ తాజాగా ఆయనకు చెందిన సుజనా కంపెనీకి భారీ షాక్ ఇచ్చింది.

బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన వైస్రాయ్‌ హోటల్స్‌ ఆస్తులను జప్తు చేసింది. షెల్‌ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ.364 కోట్ల కుచ్చుటోపీ పెట్టినట్టు గుర్తించిన ఈడీ ఈ మేరకు చర్య తీసుకుంది. మనీ ల్యాండరింగ్‌ 2002 చట్ట ప్రకారం హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్స్‌ ఆస్తులను అటాచ్‌ చేసింది. సుజనా చౌదరికి సంబంధించిన షెల్ కంపెనీ నుంచి భారీగా నిధుల బదలాయింపు జరిగినట్లు అధికారులు గుర్తించారు.

బీసీఈపీఎల్ కంపెనీ ద్వారా రూ.364 కోట్ల రుణం తీసుకున్న సుజనా గ్రూప్.. నిధులను పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ ఆస్తులు, బోగస్‌ ఇన్వాయిస్ లతో బ్యాంకులను సుజనా గ్రూప్‌ బురిడీ కొట్టించినట్టు ఈడీ విచారణలో తేలింది. చైన్నైలోని ఆంధ్రా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని షెల్‌ కంపెనీలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్టు తేలింది.

మహల్‌ హోటల్‌ అనే డొల్ల కంపెనీని సృష్టించి దీని నుంచి డబ్బును వైస్రాయ్‌ హోటల్‌ లిమిటెడ్‌కు తరలించినట్టు దర్యాప్తులో బయటపడింది. హైదరాబాద్ లోని సుజనా గ్రూప్‌ కార్యాలయం నుంచి కీలక పత్రాలను ఈడీ అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బరు స్టాంపులను కూడా గుర్తించారు. షెల్ కంపెనీ ద్వారా భారీ మొత్తంలో డబ్బు బదలాయించినట్లు సీబీఐ గుర్తించింది. బీసీఈపీఎల్ కంపెనీ వ్యవహారాన్ని ఈడీకి సీబీఐకి అప్పగించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles