పిచ్చి పలు రకాలు అని అంటుంటారు. అయితే ఇప్పటి వరకు వివాహ వేడుకలను కూడా చాలా మంది తమకున్న కోరికానుసారం పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే అందరిలా ఎందుకు అనుకున్నారో.. లేక తమకంటూ ఓ వినూత్నత వుండాలని భావించారో కానీ ఓ జంట వింత పద్ధతిలో వివాహం చేసుకున్నారు. పెళ్లంటే సంప్రదాయబద్దంగా చేసుకోవాల్సిన కార్యక్రమాన్ని.. సరదా తంతుగా మార్చేశారు. వీరి పెళ్లికి సంబంధించిన తంతు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ప్లోరిడాలోని ఓ జంట వివాహం వినూత్నంగా, వింత పద్దతిలో జరగడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. పిక్ అప్ ట్రాక్కుపై తమ పెళ్లి పందిని డిజైన్ చేసుకున్న ఈ జోడి.. దాని వెనుకున్న భాగంలో నిలబడి క్రిస్టియన్ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇందులో అంత విశేషమేముంది అంటారా.? ఆగండాగండీ.. ఈ పెళ్లి విశేషాల్లో అది కేవలం న్యూస్ రీల్ మాత్రమే. అసలు సినిమా ఏంటో తెలిస్తే మీరు కూడా ముక్కుమీద వేలేసుకుంటారు.
రెండు జీవితాలను ముడివేసే వివాహమంటే.. పెళ్లి కూతురు తన సంప్రదాయాల ప్రకారం ముస్తాబవుతుంది. క్రైస్తవ ఆచారం ప్రకారం తెల్లని గౌను ధరించి.. తెల్లని టోపి.. తెల్లని బూట్లు అలా చూస్తే మొత్తంగా శ్వేతవర్ణంలోని నిండుగా ముస్తాబైన రాణిలా మెరుస్తుంది. కానీ మనం చెప్పుకునే ఈ పెళ్లి కూతురు మాత్రం బికినీ వేసుకొని ఉంది. మరోపక్క పెళ్లి కొడుకు తక్కువ తినలేదండోయ్..పెళ్లి కొడుకు కూడా షర్ట్ వేసుకోకుండానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు.
బికినీలో ఉన్న పెళ్లి కూతురిని వివాహమాడి, ఆమెను మినీ ఆటో నుంచి కిందికి అపురూపంగా దించాడు. ఆ తర్వాత ఇంకాస్త అపురూపంగా ఎత్తుకుని ముద్దులు కూడా పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆమెను తీసుకెళ్లి ఓ బురదగుంటలో పడేసాడు. తను కూడా బురదగుంటలో దూకేసి..ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. ఈ వింత వివాహానికి హాజరైన వారి మిత్రులు ఈ చిత్రాలను కెమెరాల్లో బంధించారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటికే దాదాపు లక్షమంది దీనిని షేర్ చేసారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more