Soaring temperatures in Hyderabad భానుడి భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Soaring temperatures spell a tough summer for hyderabad people

sun stroke, heat stroke, soaring temperatures, dr k shankar, fever hospital, summer tempetraures in hyderabad, nallakunta, superintendent, summer tempetraures in Telangana, summer tempetraures inAndhra pradesh, water borne diseases, hyderabad news, telangana, news

The soaring temperatures and dry heat is all set to become a major cause for the rise of seasonal ailments among the community in Hyderabad and elsewhere in the State.

భానుడి భగభగలు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Posted: 04/02/2019 01:18 PM IST
Soaring temperatures spell a tough summer for hyderabad people

వేసవి భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ప్రజలను తన భగభగలలో అల్లాడిపోయేలా చేస్తున్నాడు. ఉదయం నుంచే ఉగ్రరూపాన్ని దాల్చుతూ ప్రకృతిలోని పశుపక్షాదులను భయభాంత్రలకు గురిచేస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే ఇక పండు వేసవిలో పరిస్థితులు ఎలా వుంటాయన్నది అర్థం చేసుకోవచ్చు. ఉష్ణోగ్రత్తలో మార్పులు రోజురోజుకూ మారిపోతున్నాయి. ఈ స‌మ్మర్ లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణం శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.  

హైదరాబాద్ సహా ఏపీ తెలంగాణలో పలుచోట్ల ప‌గ‌టి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రామగుండం, కొత్తగూడెం పట్టణాల్లో గరిష్టంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిర్మల్ జిల్లా పెంబిలలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపరితల అవర్తనం ఏర్పడి వాటి వల్ల క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడతున్నాయని, వీటి వల్ల రానున్న రోజుల్లో వర్షాలు కూడా కురిసే అవకాశాలు వున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇటు హైదరాబాద్ నగరంలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూ నమోదయ్యాయి. నగరంలోని ముషీరాబాద్ లో అత్యంత  42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. ముషీరాబాద్, కుతుబల్లపూర్ 42.2 డిగ్రీలు, మైత్రివనం 42.1, బాలనగర్ 41.8 డిగ్రీలు.. ఆదిలాబాద్, నిజామాబాద్ లలో 42 డిగ్రీలు నమోదయ్యింది. మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్..రామగుండంలలో 41 డిగ్రీలు.. ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వీకెండ్స్ లో హాయిగా బైటకు వెళ్లి ఎంజాయ్ చేయానుకునేవారు సైతం ఎండ తాకిడికి ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టేందుకు అలోచనలో పడిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sun stroke  heat stroke  soaring temperatures  Hyderabad  Telanagana  Andhra pradesh  

Other Articles