Mayawati and Pawan Kalyan public meeting in AP, Telangana విజయవాడ, హైదరాబాద్ జనసేన సభలకు మాయావతి..

Bsp chief mayawati and pawan kalyan public meeting in ap telangana

janasena meetin in Hyderabad, BSP Mayawati public meet, BSP Janasena public meet, BSP Janasena left parties meeting in Visakhapatnam, BSP Janasena left parties meeting in Vijayawada, BSP Janasena left parties meeting in Tirupati, BSP Janasena left parties meeting in Hyderabad, Andhra Pradesh, Politics

BSP party chief Mayawati to attend few meetings in Andhra Pradesh and Telangana in support of Janasena with its party chief Pawan Kalyan,

విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ జనసేన సభలకు మాయావతి..

Posted: 04/01/2019 08:30 PM IST
Bsp chief mayawati and pawan kalyan public meeting in ap telangana

జ‌న‌సేన పార్టీ తొలిసారిగా తెలంగాణ ఎన్నికల బరిలోనూ నిలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయని జనసేన పార్టీ పార్లమెంటు ఎన్నికలలో మాత్రం బ‌రిలోకి దిగ‌ుతుంది. ఈ నేపథ్యంలో హైదరబాద్ లో పవన్ కల్యాణ్ ఓ భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టారు. ఈ ఎన్నికలలో వామపక్ష పార్టీలతో పాటు బీఎస్సీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల సమరశంఖం పూరించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ హైదరాబాద్ నగరంలోనూ ఆయా పార్టీలతో కలసి భారీ బహిరంగ సభను నిర్వహించి తన పార్టీ సత్తాను చాటనున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయవతి ఈనెల 2న రాష్ట్రానికి రానున్నారు. పవన్ కల్యాణ్ తో కలిసి ఆమె అనేక సభల్లో పాల్గొంటారు. ఏప్రిల్ 3న విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు.

ఇక ఆ మరుసటిరోజు అంటే ఏప్రిల్ 4న తిరుపతిలో జరిగే సభకు కూడా మాయావతి ముఖ్యఅతిధిగా హాజరవుతారు. అదే రోజు సాయంత్రం పవన్ కల్యాణ్ తో కలిసి హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ తో కలసి మాయావతి తొలిసారి జనసేన మిత్రపక్ష పార్టీగా తెలంగాణలోని హైదరాబాద్ బహిరంగసభలో పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mayawati  visakhapatnam  vijayawada  tirupati  hyderabad  public meetins  Andhra Pradesh  Politics  

Other Articles