sai prathap resigns to TDP టీడీపీకి మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్ రాజీనామా

Former union minister sai prathap resigns to tdp party

sai prathap resigns to TDP, former Union Minister resigns to TDP, Sai Pratap Rajampeta Parliamentary seat, sai pratap, former Union Minister, Rajampeta MP constituency, Congress, TDP, Andhra Pradesh, politics

Another blow to TDP party as former Union Minister and Senior Leader Sai prathap resigns to party. He is the one who won the elections for six times as an MP from Rajampeta Parliament constituency.

టీడీపీ పార్టీకి మరో దెబ్బ.. రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి

Posted: 03/30/2019 08:42 PM IST
Former union minister sai prathap resigns to tdp party

సార్వత్రిక ఎన్నికల వేళ కడప జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనకు ఎంపీ టికెట్‌ దక్కుతుందని భావించిన ఆయన తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ పార్టీలో మాజీ కేంద్రమంత్రిగా వ్యవహరించిన తనకు తగిన గుర్తింపు లేకపోవడం.. కనీసం తనను ఎంపీ సీటు కేటాయింపులో పరిగణలోకి కూడా తీసుకోకపోవడంతో ఆయన నోచ్చుకున్నారు. దీంతో ఆయన టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.

రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రాజంపేట పార్లమెంట్‌ టికెట్‌ ఆశించి టీడీపీలో భంగపడ్డారు. యూపీఏ హయాంలో  ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. సాయిప్రతాప్ వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. సాయిప్రతాప్ రాష్ట్ర విభజనకు ముందు రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. 2009 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేంద్రంలో మంత్రి  కూడా అయ్యారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో పరిణామాలు మారిపోయాయి.

2011లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన సాయిప్రతాప్... 2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. వైఎస్ఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన వైసీపీలో చేరతారని భావించినా... 2016లో టీడీపీలో చేరారు. టీడీపీ తరపున మళ్లీ ఎంపీగా పోటీ చేస్తారని అనుకున్నారు. చంద్రబాబు మాత్రం అవకాశం ఇవ్వలేదు. రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు భార్య, టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు.

టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న సాయిప్రతాప్... టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరతారనే అంశంలో క్లారిటీ లేదు. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందు సాయిప్రతాప్ టీడీపీని వీడటం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీకి కొంత నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Pratap  former Union Minister  Rajampeta MP constituency  Congress  TDP  Andhra Pradesh  politics  

Other Articles