Janasena condems fake news మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసే: జనసేన

Janasena condems news of cancellation of glass tumbler symbol

pawan kalyan, janasena, Pawan Kalyan glass tumbler, Pawan Kalyan fake news, JanaSena Glass Tumbler, Janasena blade symbol, janasena election symbol, glass tumbler, andhra pradesh, politics

Actor turned Politician Pawan Kalyan's party Janasena condems news of cancellation of glass tumbler symbol, as their is a fake news doing huge rounds in social media.

మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు.. ఫేక్ వార్తలను ఖండించిన జనసేన

Posted: 03/28/2019 10:52 PM IST
Janasena condems news of cancellation of glass tumbler symbol

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా ఐదేళ్ల క్రితం అవిర్భవించిన జనసేన పార్టీ.. గత ఎన్నికలలో కేంద్రంలో బీజేపి పార్టీని, రాష్ట్రంలో టీడీపీ పార్టీని సమర్థిస్తూ ప్రచారం చేసి వారిని అధికారం అందడంలో దోహదపడింది. అయితే ఈ సారి మారిన పరిస్థితుల రిత్యా.. తాము ప్రశ్నిస్తూన్నా.. ప్రశ్నించడానికి కూడా చట్టసభల్లోకి వెళ్లాలన్న భావనతో నేరుగా ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టింది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన. అయితే ప్రత్యర్థి పార్టీలు ఒకరి పార్ట్ నర్ అని, యాక్టర్ అని విమర్శిస్తున్న క్రమంలో ఇలాంటి నాటకాలు చాలానే వుంటాయని జనసేనాని చెప్పిన గంటలు గడవక ముందే ఆ పార్టీపై విషప్రచారం మొదలైంది.

జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గాజుగ్లాసు గుర్తును కేటాయించిన నేపథ్యంలో.. పార్టీ అభిమానులను, కార్యకర్తలను గంధరగోళానికి గురిచేయడానికి కొన్ని సంఘవిద్రోహశక్తులు కుటిలయత్నాలకు తెరలేపాయి. సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ గుర్తుపై విపరీతమైన దుష్ప్రచారం మొదలుపెట్టాయి. గ్లాసు గుర్తును రద్దు చేశారని, కొత్తగా జనసేన పార్టీకి బ్లేడు గుర్తు కేటాయించారంటూ కథనాలు తెరపైకి వచ్చాయి.

ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక లెటర్ హెడ్ తో ఉన్నట్టుగా ఓ ప్రెస్ నోట్ వైరల్ అవుతోంది. అది నిజమే అని నమ్మిన నెటిజన్లు విపరీతంగా షేర్ చేయడం మొదలుపెట్టారు. ఎన్నికల కమీషన్ నే ఈ విధంగా గుర్తును మార్చిందా.? లేదా.? అన్న విషయాన్ని నిర్ధారించుకోకుండా.. యువత విపరీతంగా ఈ పోస్టును షేర్ చేసుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చివరాఖరున విషయం జనసేన నాయకత్వానికి కూడా పాకింది. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిన పార్టీ వర్గాలు స్పందించాయి.

జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసేనని, ఎన్నికల సంఘం గుర్తును రద్దు చేసిందన్న ఫేక్ వార్తలను అభిమానులు నమ్మవద్దని, ఇలాంటి ఫేక్ వార్తలు అనేకం వస్తాయని కూడా పార్టీ అభిమానులకు తెలిపింది. ఎన్నికల ముందు కీలక సమయంలో ఏదైనా అభిమానులతో పంచుకోవాల్సిన విషయం వుంటూ అది స్వయంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగా బహిరంగ సభల్లోనే ప్రకటిస్తారని కూడా పార్టీ వర్గాలు అభిమానులకు విషయాన్ని స్పష్టం చేశాయి.

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నది నకిలీ ప్రెస్ నోట్ అని, జనసేన గాజు గ్లాసు గుర్తు రద్దు కాలేదని, జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని జనసేన పార్టీ అధినాయకత్వం స్పష్టం చేసింది. కార్యకర్తల్లో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి కుట్రలు జరుగుతుంటాయని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కొన్ని సందర్భాల్లో జనసేన అగ్రనేతల సంతకాలు కూడా ఫోర్జరీ చేస్తున్నారని వివరించింది. తమ పార్టీ గుర్తు గాజు గ్లాసేనని, అందులో ఎలాంటి మార్పులేదని మరోసారి ఉద్ఘాటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  glass tumbler  blade  fake news  andhra pradesh  politics  

Other Articles