Ganta Srinivasa Rao skips mukha mukhi programme ఆయననుంటే నేనురాను: ముఖాముఖికి గంటా డుమ్మా.!

Minister ganta srinivasa rao skips visakha medias mukha mukhi programme

minister skips mukha mukhi programme, ganta skips mukha mukhi programme, Ganta Srinivasa Rao, Vishnu kumar raju, AP Education minister, visakha north assembly constituency, Visakha Media Forum, Mukha mukhi, General Elections 2019, TDP, BJP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, visakhapatnam, Andhra Pradesh, Politics

Andhra pradesh Education minister and Senior TDP leader skips direct interaction (mukha mukhi) programme organised by Visakha Media, after he come to know that BJP sitting MLA Vishnu kumar raju is attending the programme.

విష్ణుకుమార్ రాజు వుంటే నేనురాను: ముఖాముఖికి గంటా డుమ్మా.!

Posted: 03/28/2019 12:38 PM IST
Minister ganta srinivasa rao skips visakha medias mukha mukhi programme

ఆంధ్రప్రదేశ్ మంత్రి తనకు పరాభావం ఎదురుకావడం ఇష్టం లేక చివరి క్షణంలో మీడియాకు షాకిచ్చారు. తన చేజేతులా తన పరువును తీసుకునే కార్యక్రమానినికి హాజరుకావడం ఇష్టం లేని అమాత్యులు.. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అయితే తొలుతు వస్తానని చెప్పి మంత్రివర్యులు చెప్పడంతో అన్ని ఏర్పాట్లు చేసి.. విస్తృతంగా ప్రచరాం కూడా చేసిన తరువాత ఆఖరుక్షణంలో ఆయన హ్యాండివ్వడంతో విశాఖ మీడియా ఆయన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

ఇంతకు ఆ అమాత్యుల వారు ఎవరు అనుకుంటున్నారా.? రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎన్నికల తరుణంలో విశాఖ జర్నలిస్ట్ ఫోరమ్ విశాఖలోని నియోజకవర్గాల అభ్యర్థులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి.. వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులను ముఖాముఖి కార్యక్రమానికి అహ్వానించింది. తొలుత హాజరవుతానని చెప్పిన గంటా చివరికి ముఖం చాటేశారు.

ఈ విషయాన్ని ఫోన్ లో మీడియా మిత్రులకు గంటా తెలియజేసిన మంత్రివర్యులు తాను ఎందుకు రావడం లేదో కూడా వివరణ ఇచ్చారు. ఈ సమావేశానికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజు వస్తున్నారని గంటా తెలిపారు. విష్ణుకుమార్ రాజు ఉంటే తాను ముఖాముఖికి రానని స్పష్టం చేశారు. ఒకవేళ తాను ముఖాముఖికి వస్తే రాజు తనకు మాట్లాడే అవకాశం కల్పించకుండా, ఏకఫక్షంగా వాదిస్తూ.. తనపై అరోపణలు గుప్పించే అవకాశం వుందని, ఇలాంటి కీలక సమయంలో తన పరువు తీసుకునే ఇష్టం లేక తాను రావడం లేదని గంటా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున కేకే రాజు, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌ రాజు, ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, జనసేన అభ్యర్థిగా పి. ఉషాకిరణ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా గోవిందరాజు పోటీ చేస్తున్నారు. ఈ ముఖాముఖి సదస్సుకు గంటా తప్ప మిగతా నేతలందరూ హాజరయ్యారు. ఇటీవల విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. విశాఖ నార్త్ కొండలపై గంటా కన్నుపడిందనీ, అందుకే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఓటును రూ.10,000  పెట్టి కొంటున్నారని విమర్శించారు. గంటా పోలింగ్ ఏంజెట్లను సైతం కొనేసే ప్రమాదకరమైన వ్యక్తి అని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles