ys jagan appeals people to recollect TDP five years rule బాబు మళ్లీ వస్తే.. ఇవన్నీ బంద్: జగన్ జోస్యం..

Ys jagan appeals people to recollect tdp five years rule

YS Jagan vishaka election campaign, Andhra Pradesh Election 2019, YS Jagan Mohan Reddy, YSR Congress Party, Payakaraopeta, Andhra Pradesh, politics

YSRCP president YS Jagan appealed people to recollect the five years hell conditions of poor in TDP Rule. He also alleged that, if TDP government comes agian into power chandrababu will privatise RTC, Power, and lift all the schemes for the poor.

చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై జగన్ ఫైర్.. మళ్లీ బాబు వస్తే..

Posted: 03/27/2019 04:28 PM IST
Ys jagan appeals people to recollect tdp five years rule

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తొలిదశ సార్వత్రిక ఎన్నికలకు కూడా ముహూర్తం సమీపిస్తున్న క్రమంలో రాష్ట్రంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్ లతో పాటు జాతీయ పార్టీలైన బీజేపి, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా తమ శక్తి మేరకు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని మరోమారు నిలబెట్టుకోవాలని టీడీపీ, అధికారాన్ని అందుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జగన్, మార్పు సాధించాలని.. యువతకు బంగారు భవితను అందించాలని పవన్ కల్యాణ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

కాగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ అధినేత జగన్.. అధికార టీడీపీ ప్రభుత్వం, సీఎం బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. బాబు మరోసారి అధికారంలోకి వస్తే తీవ్రమైన సమస్యలు ఏర్పడుతాయని వెల్లడించారు. బాబు ప్రకటించిన పథకాలు రద్దవుతాయని, చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదని అన్నారు. కరెంట్‌, ఆర్టీసీ, పెట్రోల్‌ సహా అన్నీ చార్జీలు పెంచేస్తాడని జోస్యం చెప్పారు. ఒక 20 రోజులు ఓపిక పడితే వైసీపీ అధికారంలోకి వస్తుందని..సమస్యలు తీరుతాయని ప్రతొక్కరికి చెప్పాలని ప్రజలను కోరారు.

బాబు అధికారంలోకి వస్తే పలు పథకాలు, కార్యక్రమాలు రద్దు చేస్తారని జగన్ వెల్లడించారు. అంతకుముందు విశాఖ జిల్లా పాయకరావుపేటలో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమయంలో గెలుపొందేందుకు బాబు ప్రతి గ్రామానికి డబ్బుల సంచులు పంపిస్తాడని ఒక్కో ఓటర్ కు రూ. 3వేలు పంచే ప్రయత్నం చేస్తాడని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తే  ఎలాంటి పనులు చేస్తామో ప్రకటించారు. పలు సంక్షేమ పథకాలతో రైతులను, డ్వాక్రా సంఘాల వారిని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని జగన్ హామీనిచ్చారు.

మళ్లీ బాబు సీఎం అయితే..
* డ్వాక్రా సంఘాలకు వడ్డీలు పెంచుతాడు.
* బ్యాంకుల నుండి వచ్చే రుణాలు రైతులకు ఇవ్వడు.
* రైతులకు సబ్సిడీలను తొలగిస్తారు.
* మళ్లీ అధికారంలోకి భూములు ఇళ్లు లాక్కొంటారు.
* బాబు చెప్పిన పథకాలు అన్నింటినీ రద్దు చేస్తాడు.
* రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు.
* ఆరోగ్య శ్రీ పూర్తిగా రద్దు చేస్తారు.
* 108, 104 ఏవీ ఉండవు.
* రూ. 40 వేలు ఉన్న లారీ ఇసుక రూ. లక్ష అవుతుంది.
* కాలేజీల ఫీజులు ఆకాశాన్ని అంటుతాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ పూర్తిగా రద్దు చేస్తారు.
* పేదవాడి సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది.
* వ్యతిరేకించే వారిని బాబు వదిలిపెట్టడు.
* బాబు..ఆయన మనుషులు ఎలాంటి నేరం చేసినా పత్రికలు, టీవీల్లో వార్తలు రావు.
* రాష్ట్రంలో పరిపాలన అనేది ఉండదు.
* రేషన్ కార్డులను, పెన్షన్లు తొలగిస్తారని జగన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles