shock to minister narayana.. co brother joins YCP మంత్రి నారాయణకు షాక్.. వైసీపీలోకి తోడల్లుడు..

Shock to minister narayana co brother joins ycp

minister narayana, minister narayana gets shock, minister narayana recieves shock, minister narayana ram mohan, minister narayana co brother, minister narayana co brother ram mohan, nellore city politics, General Elections 2019, TDP, BJP, YSRCP, Chandrababu, YS Jagan, Congress, Assembly Elections, Andhra Pradesh, Politics

Andhra pradesh Minister Narayana who is asking people's mandate for the first time in Nellore city recieves a shock from his own relative. His co-brother Ram Mohan joins YSRCP party.

మంత్రి నారాయణకు షాక్.. వైసీపీలోకి తోడల్లుడు..

Posted: 03/27/2019 01:56 PM IST
Shock to minister narayana co brother joins ycp

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బరిలో తొలిసారిగా దిగుతూ ప్రజల అభీష్టాన్ని కోరుతూ రణక్షేత్రంలోకి అడుగుపెట్టిన రాష్ట్ర మంత్రి, టీడీపీ నేత నారాయణకు సరిగ్గా ఎన్నికలకు మరో పక్షం రోజులు కూడా లేని సమయంలో ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి నారాయణ తోడల్లుడు రామ్మోహన్ ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకి కూడా దూరంగా జరుగుతూ ప్రత్యర్థి పార్టీ వైసీపీలో చేరారు.  వైసీపీ నేతలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అనిల్ కుమార్ ల సమక్షంలో రామ్మోహన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ కు  కండువా కప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ పాలన నచ్చకే తాను వైసీపీలో చేరానని తెలిపారు. నెల్లూరు జిల్లాను రూ.5,000 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి నారాయణ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒకవేళ నిజంగానే నెల్లూరును రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ఇప్పుడు డబ్బులు పెట్టి ఓట్లను ఎందుకు కొంటున్నారని నిలదీశారు.

నెల్లూరు జిల్లాలో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో ఈ రాజకీయ మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడంతో మంత్రి నారాయణకు ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు రామ్మోహన్ రాకతో జిల్లాలో వైసీపీ మరింత బలపడుతుందని ఆ పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మంత్రి నారాయణ విధానాలు తమ కుటుంబసభ్యులకు నచ్చకే వారు ఆయనకు మద్దతు ఇవ్వడం లేదని కూడా పుకార్లు షికార్లు చే్తున్నాయి. ఇక దీనిపై స్పందించిన టీడీపీ వర్గాలు మాత్రం తాము ఓట్లను కొంటున్నామన్న వార్తలు పూర్తిగా సత్యదూరమని అదే జరిగితే రామ్మాహన్ తమ గూటి నుంచి వైసీపీకి ఎందుకు వెళ్తారని ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minister narayana  co brother  ram mohan  nellore city politics  vijayawada  Andhra Pradesh  Politics  

Other Articles