High court notices to CM KCR తెలంగాణ సీఎం కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు..

Cm kcr not specifies his criminal cases hc issues notices

Criminal cases on CM KCR, KCR criminal cases, high court notices to KCR, high court notices to CEO, Lok Sabha Election 2019, Telangana, Telangana Assembly, Telangana Election 2018, Telangana Politics

High Court of Telangana issues notices to CM KCR, chief Election officer and 12 others on not specifying the original criminal cases on him rather he put only 4 cases on a person from Gajwel filing the petition in the apex court.

కేసీఆర్ కు హైకోర్టు నోటీసులు.. 4వారాల్లోగా స్పందించాలని అదేశాలు

Posted: 03/26/2019 05:01 PM IST
Cm kcr not specifies his criminal cases hc issues notices

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018లో నిర్వహించిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం సీఎంకు నోటీసులను జారీ చేసింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్ దాఖలైంది.

కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వెల్ కు చెందిన శ్రీనివాస్ అనే ఓటరు కేసీఆర్ పై ఈ పిటీషన్ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పొందుపరిచినందువల్ల కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని శ్రీనివాస్ కోర్టుకు అప్పీల్ చేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా ఎన్నికల కమీషన్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ వివరాలతో సంబంధమున్న మొత్తం 14 మందికి నోటీసులు జారీ చేసింది.

కేసీఆర్ పోందుపర్చని వివరాలేంటి.?

గత ఏడాది డిసెంబర్ 7న జరిగిన తెలంగాణ అసంబ్లీ ముందస్తు ఎన్నికల సందర్భంగా కేసీఆర్ తనపై నమోదైన కేసులపై అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపర్చారు. ఆయనపై ఏకంగా 64 క్రిమినల్ కేసులు ఉంటే మొదటి అఫిడవిట్ లో కేవలం 4 కేసులు మాత్రమే చూపారని పిటిషనర్‌ పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సీఎం కేసీఆర్ సహా 14 మందికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా స్పందించి వివరణను ఇవ్వాలని అదేశించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles