TDP and YCP fix over pawan kalyan janasena జనసేనానిపై అసత్యవార్తలు.. కట్టుకధల టైటిళ్లు..

Tdp and ycp fix over pawan kalyan janasena

yellow media, ycp media, pawan kalyan, janasena, media articles, pawan kalyan tour in Guntur district, pawan kalyan election campaign in guntur, Guntur, Andhra Pradesh, Politics

Andhra pradesh Ruling TDP party and Opposition YCP party seems to be fixed over pawan kalyan janasena, as he is drawing huge crowds without working out at the ground level.

సాక్షిలో పవన్ పై సత్యదూరమైన వార్త.. ఆ రెండు పార్టీలు ఫిక్స్..

Posted: 03/26/2019 01:27 PM IST
Tdp and ycp fix over pawan kalyan janasena

రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయంగా అవిర్భవించిన జ‌న‌సేన పార్టీ రాష్ట్రంలోని యువత నుంచి పెద్ద ఎత్తున అదరాభిమానాలను చూరగోంటూ ఎన్నికల రణక్షేత్రంలో దూసుకుపోతొంది. ఈ క్రమంలో రాష్ట్రంలో తిష్ట వేసిన రాజకీయా పార్టీలు పవన్ కల్యాణ్ పార్టీని మొగ్గలోనే తుంచివేసేందుకు కుట్రలు పన్నుతున్నాయా.? అంటే ఔనన్న సమాధానాలనే కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లో వైరివర్గాలుగా వున్న అధికార టీడిపీ, ప్రతిపక్ష వైసీపీ వర్గాలు ఈ విషయంలో మాత్రం ఇద్దరు సిద్దాంతాలు ఒక్కటిగానే స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో తాను తృతీయ ప్రత్నామ్యాయ పార్టీ అని.. కేవలం మార్పు కోసం.. పారదర్శకమైన పాలన కోసం.. మాత్రమే తాను వచ్చానని.. ప్రశ్నించడానికి గళంతో పాటు ఆ గళానికి చట్టసభలో స్థానం కూడా కావాలని గుర్తించి ప్రత్యక్ష పోరు బరిలోకి దిగ‌ుతున్నానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఈ క్రమంలో తాను రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు, బీఎస్పీ పార్టీ మినహా ఏ పార్టీతోనే ఎలాంటి పోత్తు పెట్టుకోనని ఆయన గంటాపథంగా చెప్పుకోచ్చారు. అయినా..పవన్ పై పత్రికలు ఎల్లో జర్నలిజానికి పాల్పడుతున్నాయి. ఆయన అన్నది ఒకటైతే.. మరోవిధంగా శీర్షీకలు పెడుతూ ఆయన అభిమానులలో గంధరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇందుకు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తే నిలువెత్తు సాక్ష్యంగా మారింది. సరిగ్గా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు పూర్తిగా నిమగ్నమైన సమయంలో సాక్షి దినపత్రికలో వచ్చిన ఈ కథనం.. దాని శీర్షికకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి తెలివిలేని రిపోర్టర్ అయినా.. ఈ టైటిల్ పెట్టడు. అలా అయన పెట్టిన సబ్ ఎడిటర్ దానిని ఎలా అమోదించాడన్నది కూడా ప్రశ్న. అసలు సాక్షి పత్రికలో స్టాప్ కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారా.? అందుకనే ఇలాంటి తప్పులు ప్రచురితం అవుతున్నాయా.? అన్న అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. టీడీపీ శ్రేణులు మద్దతిస్తే అండగా ఉంటా అన్న శీర్షక బదులు టీడీపీ మద్దతిస్తే అండగా ఉంటా అన్న శీర్షక ఎలా ప్రచురించగలిగారో వారికే అర్థంకావాలి.

ఇది కేవలం సాక్షి పేపర్ వరకే పరిమితం కాదు. ఇటీవలి కాలం వరకు పవన్ కల్యాణ్ పై ఇలాంటి ఎల్లో జర్నలిజం కథనాలు, విశ్లేషణలు అనేకం వచ్చాయి. తాను కులరహిత సమాజాం కోసం పాటుపడతానని ఆయన గొంతు చించుకుని అరుస్తున్నా.. ఆయనపై కూడా కులముద్రను పత్రికలు వేశాయి. అయితే దీనిపై పవన్ కల్యాణ్ ఘాటుగానే స్పందించి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీకి అండగా నిలిచినన్నాళ్లు నా కులం మీకు గుర్తుకు రాలేదా.? అంటూ ప్రశ్నించారు. ఇలా పవన్ విషయంలో ఇటు అధికార పక్షానికి చెందిన మీడియాతో పాటు అటు ప్రతిపక్షానికి చెందిన మీడియా కూడా చేతులు కలిపి ఆయన పార్టీ అభిమానులను గంధరగోళానికి గురిచేయడానికి ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yellow media  ycp media  pawan kalyan  janasena  Guntur  Andhra Pradesh  Politics  

Other Articles

Today on Telugu Wishesh