another baba comes into light in yadadri of Telangana యాదాద్రిలో కొత్త బాబా.. కొరుకితే పిల్లలు పుడతారంతే..!

Another baba comes into light in yadadri of telangana

self declared godsman, telangana godsman koppula ram reddy, pullaiahgudem godsman koppula ram reddy, koppula ram reddy, godsman, pullaiahgudem, yadagirigutta, yadadri, Telangana, politics, Crime

poor conditions, innosence and lack of people knowledge a person from yadadri district of telangana turned out self claimed baba. It is said if he bites an women becomes mother.

యాదాద్రిలో కొత్త బాబా.. కొరుకితే పిల్లలు పుడతారంతే..!

Posted: 03/25/2019 07:14 PM IST
Another baba comes into light in yadadri of telangana

ప్రజల అమయాకత్వాన్ని బలంగా మార్చుకుని వారిని నుంచి డబ్బులు లాగుతూ తమ పబ్బం గడుపుకునే మాయాల ఫకీరులు, మాటలు నేర్చిన తాంత్రికులు తగ్గుతున్న ఈ కాలంలో.. కొత్తగా  ఈ మధ్యప్రత్యేకతలు లేని వారు కూడా బాబాలుగా అవతారమెత్తి ప్రజల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. ఇలాంటి అనేక ఘటనలు ఇప్పటికే మనం చూశాం. ప్రజల జీవనగమనంలో పెనవేసుకున్న మూడనమ్మకాలను, బలహీనతలు, వారి అవసరాలను అడ్డుపెట్టుకుని అనతికాలంలో అపర కుభేరులుగా మరుతున్నారు.

అర్థంపర్థంలేని చేష్టలతో ప్రజలను వంచిస్తూ బాబాలుగా చలామణీ అవుతుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా పుల్లాయగూడెంకు చెందిన కొప్పుల రాంరెడ్డి అనే వ్యక్తి కూడా ఇలాంటివాడే. ఆరో తరగతి వరకు చదివిన రాంరెడ్డి లోకాన్ని అంతకంటే ఎక్కువే చదివాడు. ప్రజల మూర్ఖత్వాన్ని పెట్టుబడిగా చేసుకుని బాబా అవతారం ఎత్తాడు. అయితే, మిగతా బాబాలతో పోలిక లేకుండా కొరకడం అనే విద్యను తన ప్రత్యేకతగా మలుచుకున్నాడు.

ఆడామగా తేడా లేకుండా తన వద్దకు వచ్చిన వాళ్లను ఇష్టంవచ్చినట్టు కొరుకుతుంటాడు. తాను కొరికితే సంతానం లేనివాళ్లు సంతానం పొందుతారని, మగవాళ్లకు జబ్బులు నయమవుతాయని జనాల్లో ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టాడు. మగవాళ్లను కిందపడేసి తొక్కడం, ఆడవాళ్లను ఎక్కడ పడితే అక్కడ కొరకడం వంటి చేష్టలతో జుగుప్సాకరంగా వ్యవహరిస్తుంటాడు.

అయితే రాంరెడ్డి వికృత చర్యలను కొందరు వీడియో తీయడంతో అతడి చేష్టలు వెలుగులోకి వచ్చాయి. దాంతో, పోలీసులు స్పందించి అతడిని అరెస్ట్ చేసి తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. ఆడామగా అనే తేడాలేకుండా గ్రామసింహంలాగా తన పంటిగాట్లు రుచిచూపించే ఈ కొరుకుడు బాబా రూ.100 నుంచి రూ.200 వరకు ఫీజు వసూలు చేస్తాడు. ప్రత్యేక వైద్యం పేరుతో మరికొంత బాదుతాడట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : koppula ram reddy  godsman  pullaiahgudem  yadagirigutta  yadadri  Telangana  politics  Crime  

Other Articles