tamanna simhadri files nomination from Mangalagiri మంగళగిరి బరిలో స్వతంత్ర్య అభ్యర్థిగా తమన్నా..

Transgender tamanna simhadri files nomination from mangalagiri

tamanna simhadri, tollywood junior artist, Nara Lokesh, Mangalagiri, TDP, janasena, challa srinivas, YCP, alla ramakrishna reddy, Guntur, Andhra Pradesh, Politics

Tollywood junior artist tamanna simhadri who was paopular with the srireddy issue, has files her nomination from Mangalagiri constituency.

మంగళగిరి బరిలో స్వతంత్ర్య అభ్యర్థిగా తమన్నా.. నామినేషన్ దాఖలు

Posted: 03/25/2019 02:10 PM IST
Transgender tamanna simhadri files nomination from mangalagiri

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నామినేషన్ల చివరి రోజైన ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు నామినేషన్లకు క్యూకట్టడంతో ఎన్నికల సందడి నెలకొంది. ఎందరో స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగారు. కాగా, మంగళగరి నుంచి టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న తరుణంలో ఆయనపై పోటీకి థర్డ్ జెండర్ తమన్నా బరిలోకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా మంగళగిరి నుంచి బరిలో దిగిన అమె ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

రాజకీయ పార్టీలతో థర్డ్ జెండర్‌కు ఒరిగిందేమీ లేదంటున్నారు తమన్నా.. పార్టీలన్నీ అవసరానికి వాడుకుని మోసం చేశాయన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి థర్డ్ జెండర్‌గా ప్రజా సేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని.. ఆశీర్వదించాలని కోరారు. మంగళగిరి టికెట్ కోసం జనసేన పార్టీకి దరఖాస్తు చేసుకున్నట్లు తమన్నా చెప్పారు. ఆ పార్టీ తనకు గుర్తింపు ఇవ్వలేదని.. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు చెప్పుకొచ్చారు.

ప్రజా సేవ చెయ్యాలనే సంకల్పంతో పోటీ చేయ్యాలని భావిస్తున్నట్లు తమన్నా సింహాద్రి చెప్పారు. ఇకపై మంగళగిరిలోన ఉంటానని.. ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానంటున్నారు. ఇటు మంత్రి లోకేష్‌కు తమన్నా సవాల్ విసిరారు. లోకేష్‌కు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలన్నారు. నారా లోకేష్‌కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ట్రాన్స్ జెండర్లు తమ హక్కుల కోసం అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles