kishan reddy fires on CM KCR ఆ మిత్రపక్షంతో.. హిందుత్వ నిర్వచనమా.?: కిషన్ రెడ్డి

Bjp leader kishan reddy fires on cm kcr for defining hindutva

kishan reddy fires on CM KCR, kishan reddy slams CM KCR on Hindutva defination, kishan reddy Hindutva patriotis, kishan reddy KCR AIMIM, kishan reddy, KCR, Telangana CM, Hindutva, AIMIM, secunderabad, Telangana, politics

BJP leader and contestant for secundrabad parliamentaty candidate G Kishan reddy fires on CM KCR for defining Hindutva in his own way, says hindutva means patriotism

ఆ మిత్రపక్షంతో.. హిందుత్వ నిర్వచనమా?: కిషన్ రెడ్డి ఫైర్..

Posted: 03/20/2019 04:31 PM IST
Bjp leader kishan reddy fires on cm kcr for defining hindutva

బీజేపి సీనియర్ నేత కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ నోట హిందుత్వ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లే వున్నాయని దుయ్యబట్టారు. రాజ్యాధికారం కోసం ప్రజాధనంతో యజ్ఞాలు, యాగాలు చేసినంత మాత్రం హిందువు కాదని అన్నారు. ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఎవరిని పెట్టుకుని కేసీఆర్ ఏమి మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. హిందుత్వమంటే జాతీయవాదమని కొత్త నిర్వచనాన్ని చెప్పారు.

మైనారిటీల ఓట్ల కోసమే బీజేపిపై హిందుత్వం పేరుతో కేసీఆర్‌ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ హిందుత్వానికి కొత్త నిర్వచనం చెబుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. ప్రపంచంలోనే కేసీఆర్‌కు మించిన హిందుత్వవాది లేరని అనుకోవడం పొరపాటని అన్నారు. హైదరాబాదులోని బీజేపి రాష్ట్ర ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందుత్వవాది అని చెప్పుకున్న కేసీఆర్‌ పక్కన ఎవరు ఉంటారో.. ఆయన మిత్ర పక్షం ఎవరో గమనించాలని ధ్వజమెత్తారు.

ఓట్లు, సీట్లు అంటూ కేసీఆర్‌ ఒకే ధోరణిలో ఉన్నారని విమర్శించారు. ‘‘ఇద్దరు ఎంపీలతో తెలంగాణ వచ్చిందని కేసీఆర్‌ ఎన్నికలు వచ్చినప్పుడల్లా గొప్పగా చె్ప్పుకుంటారని ఈ అంశంపై తాను ఆయనతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. లోక్ సభలో ఎంపీగా వున్న సమయంలో కనీసం ఐదు నిమిషాలు మాట్లాడని ఆయన.. ప్రస్తుతం ఆయన ఎంపీలు.. మళ్లీ గెలిచి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటున్నారని, అది ఆయన ఒక్కడితో సాధ్యపడలేదని, 1,500 మంది అమరవీరుల బలిదానంతో వచ్చిందని కిషన్‌రెడ్డి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kishan reddy  KCR  Telangana CM  Hindutva  AIMIM  secunderabad  Telangana  politics  

Other Articles