ys jagan sensational comments on forth comming government 20 రోజుల్లో రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వమే: వైఎస్ జగన్

Ys jagan sensational comments on forth comming government

YSRCP president YS Jagan, YS Jagan sensational comments in kavali town, YS Jagan sensational comments, YS Jagan on forth comming government, YS Jagan people's government, YS Jagan, YSRCP, Kavali town, sensational comments, andhra pradesh, politics

YSRCP president YS Jagan sensational comments in kavali town on forth comming government, says it will definetly be the people's government.

20 రోజుల్లో రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వమే: వైఎస్ జగన్

Posted: 03/20/2019 02:54 PM IST
Ys jagan sensational comments on forth comming government

వచ్చే నెల 11న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 9వ తేదీని ముగిసే ప్రచారానికి కేవలం 20 రోజుల సమయం మాత్రమే వుండటంతో అన్ని రాజకీయ పార్టీలు అప్పుడే ప్రజల్లోకి వెళ్లి తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జగన్ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 20 రోజుల తర్వాత ప్రజల ప్రభుత్వం వస్తుందని జగన్ చెప్పారు.

20 రోజులు ఓపిక పడదాం.. అన్నని సీఎం చేసుకుందామని జగన్ పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని జగన్ ఆరోపించారు. ఐదేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు రోజుకో అబద్దం చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అనే భయంతో టీడీపీ వెబ్ సైట్ నుంచి ఎన్నికల మేనిఫెస్టోని తొలగించారని జగన్ అన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చిందా.? అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఐదేళ్ల పాలన నిజంగా ప్రజారంజకంగా వుంటే.. ఆయన ఎల్లో మీడియా దానిని ప్రజలకు వివరించకుండా.. ఆయన పరిపాలన మీద చర్చ జరపకుండా తన మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని జగన్ ప్రశ్నించారు. మంచి పనులు చెయ్యలేక.. చంద్రబాబు రోజుకో అబద్దం చెబుతున్నారని జగన్ అన్నారు. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం అని చంద్రబాబు అన్నారని.. కనీసం రైతుల వడ్డీనైనా మాఫీ చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చిన తరువాత తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని మండిపడ్డారు. ఇక ఎన్నికలు వచ్చిన తరుణంలో ఇప్పుడు అదే ఫార్ములాను ప్రజలపై ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారని.. ఓటుకు రూ.3వేలు ఇచ్చేందుకు వస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగన్ హెచ్చరించారు. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోకండి అని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  YSRCP  Kavali town  sensational comments  andhra pradesh  politics  

Other Articles