ట్రాఫిక్ కు చెక్ పెట్టి.. గమ్య స్థానాలకు వేగంగా చేర్చాలనే ఉద్దేశ్యంతో ఆరంభమైన మెట్రో ప్రాజెక్టు మరో రూట్ లో కూడా త్వరలో సేవలను అందించనుంది. ఐటీ ఉద్యోగులతో నిత్యం రద్దీగా వుంటూ అమీర్ పేట్, హైటెక్ సిటీ మెట్రో మార్గంలో మెట్రో సేవలు ఈ నెల 20 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 20న తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేతుల మీదుగా లాంఛనంగా ఈ మార్గంలో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తమ ట్విట్టర్ లో అధికారికంగా ట్వీట్ చేసింది. గవర్నర్ తో పాటుగా కేటీఆర్, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ల పేర్లను కూడా జోడించి జతపర్చింది. భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగస్థులు ఉన్న ప్రాంతంలో మెట్రో కోసం ఎదురుచూపులకు చెక్ పెట్టనున్నారు. మార్చి 20న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ వరకూ వెళ్లనున్న రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు.
ప్రాజెక్టులో మియాపూర్ -ఎల్బీనగర్ (29 కి.మీ), నాగోల్-అమీర్‌పేట (17కి.మీ.) రూట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త రూట్‌తో ప్రయాణానికి మరింత సౌలభ్యం లభించనుంది. అమీర్‌పేట, హైటెక్‌సిటీ 11 కి.మీల మేర ప్రయాణంలో 8 స్టేషన్లు ఉన్నాయి. కాగా, హైదరాబాద్‌లో తొలిసారిగా 2017 నవంబరు 29న ప్రారంభమైంది మెట్రో. మొదటి దశలో మిగిలిన జేబీఎస్-ఎంజీబీఎస్ 10 కిమీల దూరం, ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రో రూట్ కోసం పనులు జరుగుతున్నాయి.
కాగా, అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ చేరుకునే మార్గంలో మొత్తంగా ఎనమిది స్టాపులు వున్నాయి. అమీర్ పేటు తరువాత మధురానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్, దుర్గం చెరువుల మీదుగా హైటెక్ సిటీకి చేరుకుంటుంది. దీంతో నగరంలో నిత్యం ట్రాఫిక్ రద్దీలో ప్రయాణించే వాహనదారులు కొంత ఉపశమనం లభించినట్టే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more