komma parameshwara reddy goes absconding since YS viveka murder. అజ్ఞతంలో వైఎస్ వివేకా సన్నిహితుడు కొమ్మా పరమేశ్వర రెడ్డి.?

Another twist in ys viveka murder komma parameshwara reddy goes absconding

komma parameshwara reddy absconds after ys vivekananda reddy murder, komma parameshwara reddy missing, komma parameshwara reddy absconding, komma parameshwara reddy, YS vivekananda reddy, viveka murder case, viveka mysterious murder, viveka brutal murder, simhadripuram, suhasini, crime

another twist in YS Viveka murder: viveka close aid komma parameshwara reddy goes absconding after murder.

అజ్ఞతంలో వైఎస్ వివేకా సన్నిహితుడు కొమ్మా పరమేశ్వర రెడ్డి.?

Posted: 03/18/2019 02:53 PM IST
Another twist in ys viveka murder komma parameshwara reddy goes absconding

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. వివేకా హత్యపై పలువురిపై అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో హత్య జరిగిన తర్వాత కొమ్మా పరమేశ్వర రెడ్డి అనే వ్యక్తి కనిపించకుండా పోయాడం కూడా సంచలనంగా మారింది. ఈ హత్యపై సిట్ దర్యాప్తు ను ముమ్మరం చేయగా.. ఇప్పటికే కొందరి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. పాత నేరస్థులు, పాక్షన్ గొడవల్లో తున్నవాళ్లను విచారించిన పోలీసులు.. విచారణలో అన్ని అనుమానాలను నివృత్తి చేసుకుంటూ పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో వివేకానంద రెడ్డి ముఖ్య అనుచరుడు.. అత్యంత సన్నిహితుడు అయిన  పరమేశ్వర రెడ్డి హఠాత్తుగా మాయం అయిపోవటంతో అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.  వివేకా హత్య అనంతరం భార్య సుహాసినితో కలిసి అర్థరాత్రి నుంచి మాయం అయిపోయాడు కొమ్మా పరమేశ్వర్ రెడ్డి. సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామంలో నివసించే పరమేశ్వర్ రెడ్డి భార్య సుహాసిని మండల అధ్యక్షులుగా విధులు నిర్వహిస్తున్నారు. పదవిని కూడా వదిలిపెట్టి వీరు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివేకాకు అత్యంత సన్నిహితులుగా ఉండే వీరి కుటుంబం హత్య అనంతరం అదృశ్యం కావటంతో పలు అనుమానాలను రేకిత్తిస్తోంది. పరమేశ్వర్ రెడ్డికి అనారోగ్య కారణాలతో చికిత్స కోసం ఎక్కడికో వెళ్లినట్లుగా అతని బంధువులు చెబుతున్నారు. కానీ వివేకాతో అంత సాన్నిహిత్యం ఉన్న పరమేశ్వర్ భౌతిక కాయాన్ని చూసేందుకు కూడా రాలేదు. కనీసం అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవటంతో పరమేశ్వర్ పై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కోణంలోనే సిట్ తమ దర్యాప్తును వేగవంతం చేసింది.

కాగా,  పరమేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దర్శనమివ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య గురించి అతడిని మీడియా ప్రశ్నించగా... తనకు అనారోగ్యంగా ఉండడంతో మొదట కడప సన్ షైన్ ఆసుపత్రిలో చేరానని వెల్లడించాడు. అయితే తనకు వైద్యం చేస్తున్న డాక్టర్ 3 రోజులు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం తాను తిరుపతి వచ్చానని వెల్లడించాడు. వివేకానందరెడ్డి హత్య కేసులో తన పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆయన హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశాడు. వివేకా హత్య ఇంటి దొంగల పనే అని చెప్పిన పరమేశ్వర్ రెడ్డి.... పోలీసులు అనవసరంగా తనపై నిందలు మోపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles