MP Butta Renuka Likely to Join YCP టీడీపీకి షాక్.. సొంతగూటికి ఎంపీ బుట్టా రేణుకా..

Big shock to tdp mp butta renuka likely to join ycp

Butta Renuka, Kurnool Lok Sabha, YSRCP, TDP, pulaparthy narayana murthy, p.gannavaram, bitter experience, desired MP seat, YCP MLA Desai Thippa Reddy, Madanapalle MLA ticket, Chittoor district, Andhra pradesh, Politics

MP Butta Renuka, who joined TDP and started her election campaigning in the constituency by expecting that TDP will give her Kurnool Lok Sabha seat in the coming elections has faced the bitter experience as she was not offered the desired ticket.

టీడీపీకి షాక్.. సొంతగూటికి ఎంపీ బుట్టా రేణుకా..

Posted: 03/15/2019 08:12 PM IST
Big shock to tdp mp butta renuka likely to join ycp

సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా రావడంతో తమకు కావాల్సిన స్థానాలపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు తమకు దక్కకపోవడంతో ప్రత్యర్థి పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఇక మరికొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగుతామని బాహాటంగా ప్రకటిస్తున్నారు. అధికార పార్టీతో పాటు విపక్ష పార్టీలు తమ అభ్యర్థులు ప్రకటించేందుకు కసరత్తు ప్రారంభించగానే తమకు టికెట్ దక్కలేదని ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా ఇవాళ జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీకి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే దూరం కాగా, వైసీపీకి ఒక ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు.

కర్నూలు పార్లమెంట్ సభ్యులు బుట్టా రేణుక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి.. ఆ తర్వాత టీడీపీ గూటికి చేరిన ఆమె.. త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తాను ఆశించిన పార్లమెంటు స్థానం అమెకు కేటాయించే విషయంలో పార్టీ నుంచి ఇప్పటి వరకు అమెకు స్పష్టత రాకపోవడంతో ఆమె తిరిగి తన సోంత గూటికి వెళ్లనున్నారు. ఈ మేరకు అనుచరుల సమావేశంలో అమె నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

కడప జిల్లా ఇడుపులపాయ వెళ్లి.. వైఎస్ వివేకానందరెడ్డి అంతిమసంస్కారాలు ముగిసిన తరువాత వైఎస్ జగన్ ను బుట్టా దంపతులు కలవనున్నారు. కర్నూలు పార్లమెంటరీ టిక్కెట్ దక్కుతుందని గంపెడాశతో వున్న అమె ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టేసింది. అయితే అమె ఆశించినదానికి విభిన్నంగా పరిణామాలు చేటుచేసుకుని అమెకు టీడీపీ నుంచి కర్నూలు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో బుట్టా రేణుకా కుటుంబసభ్యులు తిరిగి వైసీపీలో చేరనున్నారు.

కర్నూలు ఎంపీ టికెట్ ను తనకు కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమె వెంటనే తన సొంత పార్టీ వైసీపీలోకి చేరాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో చేరడంతో బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వలేకపోయింది టీడీపీ అధిష్టానం. అయితే, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని సూచించింది. అక్కడ గెలుపు అవకాశాలు లేవంటూ ఆదోని నుంచి పోటీ చేసేందుకు బుట్టా రేణుక నిరాకరించారు.

ఇదిలావుండగా మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ కండువా కప్పుకోనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డికి వైసీపీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మదనపల్లిలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడం తిప్పారెడ్డికి కలిసొచ్చే అంశంగా పరిణమించింది. దీంతో ఆయనకు టీడీపీ నుంచి టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి తిప్పారెడ్డి ఆ పార్టీతో ఉన్నారు. ఆ పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన ఆయన.. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఇక తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గన్నవరం ఎమ్మెల్యే టికెట్‌ను నేలపూడి స్టాలిన్‌బాబుకు కేటాయించడంతో అసంతృప్తికి లోనైన ఆయన పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. 2014లో వైసీపీ అభ్యర్థి చిట్టిబాబుపై 13 వేల పై చిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles