Brides tie mangalsutra on grooms వరుడి మెడలో మంగళసూత్రం కట్టిన వధువులు

Equality reigns supreme as brides tie mangalsutras to their grooms

inter-caste wedding, religious equality, Patriarchy, Modern wedding, mass wedding, gender equality, gender bender, equality, Muddebihal, Madara Chennaiah, inter-caste weddings, brides tie mangalsutra on grooms

Smashing patriarchy and age-old norms, two couples from Nalatwada town of Muddebihal district set a fine example of gender equality when the brides, too, tied mangalsutras around their husbands’ necks

వర్థిల్లు సమానత్వం.. వరుడి మెడలో వధువుల మంగళసూత్రం..

Posted: 03/13/2019 04:33 PM IST
Equality reigns supreme as brides tie mangalsutras to their grooms

ఆడవాళ్లకు సమానహక్కు, సమాన వాటా.. పురుషలతో సమానం అన్న నినాదాలు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్నా.. పెళ్లి విషయానికి వచ్చేసరికి.. వరుడే వధువుల మెడలో తాళి కట్టడం ఎన్నో తరాలుగా వస్తున్న అచారం. కానీ ఈ పెళ్లి గురించి వింటే ఇదేమి చోద్యం చెప్మా? అని అనక తప్పదు. ఎందుకంటే ఇక్కడ వరుడి మెడలో వధువు తాళి కట్టింది. ఔనా.. ఇది నిజమేనా.. వరుడి మెడలో వధువు తాళి కట్టే అనవాయితీకి ఇక్కడే చరమగీతం పడింది.

ఓస్.. సోస్.. ఇది కూడా స్వర్గీయ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన బంజలకిడి పంబ చిత్రం మాదిరిగా ఏదైనా చిత్రం షూటింగ్ నేపథ్యంలో జరిగిన తంతు అనుకుంటే పోరబాటే. ఈ ఘటన కర్ణాటకలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్‌ సమీపంలోని నాలతవాడ అనే గ్రామంలో జరిగింది. సోమవారం నాడు ఈ గ్రామంలో రెండు పెళ్లిళ్లు జరుగగా, రెండింటా, వధువలే తాళిని తీసుకుని వరుడి మెడలో కట్టారు. ఇక ఈ రెండు కళ్యాణాలు కులాంతర కావడం కూడా గమనార్హం.

ప్రభురాజ్‌ అనే పెళ్లి కొడుకును అంకిత, అమిత్‌ అనే వరుడిని ప్రియాలు కులాంతర వివాహాలు చేసుకున్నారు. నిత్య ఆచారాలకు భిన్నంగా వధువులు వరుడి మెడలో మంగళసూత్రం కట్టారు. ఇక ఈ పద్ధతేంటని ప్రశ్నించిన వారికి సమాధానం ఇచ్చిన వారు, ఇదే అసలు సిసలైన బసవణ్ణ సిద్ధాంతమని, 12వ శతాబ్ద కాలంలో ఈ పద్ధతే ఉండేదని మరీ చెబుతున్నారు. వినూత్నంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి పలువురు ఆధ్యాత్మికవేత్తలు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles