MLM company ebiz dupes for Rs. 1000 cr రూ.వెయ్యి కోట్లకు టోకరా.. 7 లక్షల మందికి శఠగోపం..

Multi level marketing company ebiz dupes for rs 1000 cr

Ebiz, Ebiz MLM, Ebiz company, Multi Level Markering, Hyderabad, Hitech city, cyberabad commissionerate, cyberabad police, MLM company dupes for Rs 1000 crores in Hyderabad, Telangana government, crime

The Hyderbad witnessed another big fraud in cyberabad, where a multi level marketing company ebiz dupes 7 lakh customers for Rs. 1000 crores. Police entered the scene and seized the company directors assets.

రూ.వెయ్యి కోట్లకు టోకరా.. 7 లక్షల మందికి శఠగోపం..

Posted: 03/12/2019 03:41 PM IST
Multi level marketing company ebiz dupes for rs 1000 cr

హైదరాబాద్ మహానగరంలో జనసాంధ్రత రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో నేరాలు కూడా అలానే పెరుగుతూపోతున్నాయి. కూకట్ పల్లి కేంద్రంగా పిఫ్ఫళ్ల పోడి స్కాం.. ఉప్పల్ కేంద్రంగా వేరుశనగ కుంభకోణం వెలుగుచూసిన క్రమంలో అప్రమత్తం కావాల్సిన ప్రజలు ఈజీ మనీ వెటలో రాత్రికి రాత్రి కుబేరులు కావాలన్న ఆశలతో తమ వద్ద వన్న కాసింత డబ్బును కూడా నయవంచకుల చేతిలో పెడుతూ వారినే నమ్ముతున్నారు.

మల్లీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఏ కంపెనీ ఏ రూపంలో వచ్చినా.. ఉపేక్షించరాదని, ప్రారంభంలో బాగానే వున్నా.. ఆ తరువాత వాటి నైజం నమ్మిన ప్రజలను మోసం చేయడమేనని పోలీసులు పేర్కోంటున్నా.. వారి దృష్టికీ ఈ విషయాలను తీసుకురాకుండా వేలాది రూపాయలు మొదలుకుని లక్షల వరకు పెట్టుబడులు పెట్టి వారిని నమ్ముతున్నారు. తీరా తమకు వస్తాయన్న డబ్బులు రాకపోయేసరికి.. చివరాఖరి క్షణంలో అయ్యో డబ్బులు.. అమ్మో డబ్బులు అంటూ అంగరాల్చుతున్నారు. తమను పలానా కంపెనీ మోసం చేసిందని అప్పుడు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

ఇదే విషయాన్ని మొదట్లోనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లితే.. భారీ స్తాయిలో జనం డబ్బులు పోగొట్టుకోరు. ఇలాంటి నిర్లక్ష్యం వల్లనే తాజాగా సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో రూ.1000 కోట్ల మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ వెలుగు చూసింది. Ebiz (ఈ బిజ్) అనే సంస్థ మల్లీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ ను ప్రవేశపెట్టి తమ కస్టమర్ల నెత్తిన శఠగోఫం పెట్టింది. ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడింది.

ఈ బిజ్ సంస్థ నిర్వాహకుల మాయ మాటలు నమ్మి అందులో పెట్టుబడి పెట్టారు. ఒకరు చేరిన తరువాత వారే మిగితా కస్టమర్లను చేర్పించాల్సి వుంటుంది. దీంతో తెలిసిన వారినే వారు సభ్యులుగా చేర్పించడంతో అటు తమ వారు మోసం చేశారని చెప్పుకునే ఛాన్స్ కూడా లేదు. దీంతో ఇక అంతా కలసి సంస్థను, సంస్థలో తొలిగా చేరిన సభ్యులను మాత్రమే నిందించాల్సిన వస్తుంది. దీంతో సభ్యులందరూ లబోదిబో అన్నాల్సిందే. బాధితులు దీనిపై సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో Ebiz సంస్థ అకౌంట్లో ఉన్న రూ.70కోట్లు సీజ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ebiz company  Multi Level Markering  Hyderabad  Hitech city  cyberabad police  Crime  

Other Articles