TDP, YSRCP complain on data theft case to CEC ఢిల్లీకి చేరిన డేటా చోరి ఎఫిసోడ్.. ఈసీకి పోటాపోటీ అరోపణలు

Tdp and ysrcp competing to complain on data theft case to cec

chief election officer, Tdp, ysrcp, Votes Deletion, bogus votes, IT Grid Data, Data Theft case, ECE, Sunil Arora, Complaint, Central Election Commission, Andhra Pradesh, Politics

The Andhra Pradesh political parties Telugu desam and YSR congress parties head to delhi to complaint against each other in regard of data theft to Chief Election Commission.

ఢిల్లీకి చేరిన డేటా చోరి ఎఫిసోడ్.. ఈసీకి పోటాపోటీ అరోపణలు

Posted: 03/11/2019 08:16 PM IST
Tdp and ysrcp competing to complain on data theft case to cec

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీతో పాటు లోక్ సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్డు విడుదలైన క్రమంలో రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీలు హస్తిన బాట పట్టాయి. రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య ముదురుతున్న ఓట్ల తొలగింపు వ్యవహారం, డేటా చౌర్యం అంశాలు దేశ రాజధానికి చేరాయి. దాదాపుగా 7 లక్షల ఫారం-7 దరఖాస్తులు దాఖలు చేసిన అంశంతో పాటు, డేటా చోరీ ఆంశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఇవాళ ఫిర్యాదు చేసింది.

మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, కాల్వ శ్రీనివాసులు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే.. డేటా చోరీ, ఫారం-7 అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెండు 'సిట్‌'లను ఏర్పాటు చేసింది. కాగా, టీడీపీ నేతలకు పోటీగా ఇటీవలే ఒక పర్యాయం సీఈసీ అధికారులను కలసిన వైసీపీ నేతలు ఇవాళ మరోమారు వారిని కలసి తమ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను అక్రమంగా సర్వేల పేరుతో తొలగించారని పిర్యాదు చేసింది.

ఇదిలావుండగా, డేటా చోరీ కేసులో కీలకంగా మారిన ఐటీ గ్రిడ్స్‌ కేసులో సీఈవో అశోక్‌ కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగగా, పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇప్పించాలని తెలంగాణ సర్కార్ కోరింది. కాగా, అశోక్ తరుపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లోత్ర ఇప్పుడే వివరణ ఇవ్వలేమంటూ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..  తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tdp  ysrcp  Votes Deletion  bogus votes  IT Grid Data  Data Theft case  Andhra Pradesh  Politics  

Other Articles