will waive off all farmer loans Rahul Gandhi పక్షం రోజుల్లో రైతు రుణాలు మాఫీ: రాహుల్ గాంధీ

Will waive off all farmer loans in 15 days if congress voted to power rahul gandhi

Rahul Gandhi, Telangana, shamshabad, Andhra Pradesh, women reservation bill, Madhya Pradesh, lok sabha, loan waiver, India, farmers, politics

Congress president Rahul Gandhi Saturday assured a farmers to waive off all loan of the peasants of India within 15 days in Telangana that if his party was voted to power at the Centre this year.

పక్షం రోజుల్లో రైతు రుణాలు మాఫీ: రాహుల్ గాంధీ

Posted: 03/09/2019 07:42 PM IST
Will waive off all farmer loans in 15 days if congress voted to power rahul gandhi

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.దేశంలో రైతుల తమ అప్పులు మాఫీ చేయమని వేడుకుంటుంటే, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ  బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్ధిక నేరగాళ్ళ అప్పులు మాఫీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశాన్ని రెండుగా విభజిస్తున్నారని ఆయన అన్నారు.

ధనికుల భారత్, పేదల భారత్ గా మార్చారని దేశాన్ని విభజిస్తున్నారని రాహుల్ అన్నారు. అధికారంలోకి వచ్చే ముందు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసంచేశారని, ఉద్యోగాల్లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని రాహుల్ చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీలు  కేంద్రంలో  నరేంద్ర మోడీకి  మద్దతు తెలుపుతున్నారని,  నోట్లరద్దు,జీఎస్టీకి కేసీఆర్ మద్దతు తెలిపారని ఆయన అన్నారు.

నరేంద్ర మోడీ రాఫెల్ కుంభకోణంతో అనిల్  అంబానీ కి  వేల కోట్ల రూపాయలు దోచి పెట్టారని ఆరోపించారు. రాఫెల్ స్కాంపై విచారణ  చేయాలని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించరని  ఆయన అడిగారు. రూ.526 కోట్లతో తయారయ్యే రాఫెల్ యుధ్దవిమానాన్ని  రూ.1600 కోట్లకు పెంచారని ఆయన తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే భారత్ లోని పేదవాళ్ల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులేస్తామని రాహుల్ తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటూ రాహుల్ గాంధీ ప్రకటించారు.

మార్చి 08వ తేదీన మహిళా దినోత్సవం ఉంటే..అదే రోజున UP రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మహిళపై అత్యాచారం చేసినా పీఎం మోడీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదన్నారు. అంతేగాకుండా అత్యాచార ఘటనపై కనీసం ఎంక్వయిరీ చేయలేదన్నారు. మోడీ పాలనలో మహిళలు బయటకు తిరగలేని పరిస్థితి ఉందని..భయంతో కాలం గడుపుతున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి కాంగ్రెస్ రాగానే మహిళా రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని హామీనిచ్చారు. లోక్ సభ, రాజ్యసభలలో రిజర్వేషన్ బిల్లు పాస్ అయ్యే విధంగా చూస్తామని, అన్నిసభలలో మహిళలు కనబడుతారని ప్రకటించారు. మహిళలపై ఎలాంటి ఘటనలకు పూనుకున్నా..కఠినంగా చూస్తామని రాహుల్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Telangana  shamshabad  lok sabha  loan waiver  India  farmers  politics  

Other Articles