janasena announces rythu bandhu to farmers రైతుబంధు హామీని ప్రకటించిన జనసేన

Janasena announces rythu bandhu to farmers rs 8000 aid per acre

pawan kalyan, janasena, Pawan Kalyan rythu bandhu, Pawan Kalyan rythu bandhu national employment Guarantee, Pawan kalyan farmers, Pawan Kalyan twitter, pawan kalyan janasena rythu bandhu, janasena rythu bandhu, andhra pradesh, politics

janasena party too announces crop investment rs 8000 aid per acre to farmers as aid, the similar aid as telangana government is giving to peasants under rythu bandhu scheme. The party had announced it today in its twitter account

రైతుబంధు హామీని ప్రకటించిన జనసేన.. ఎకరాని రూ.8 వేలు..

Posted: 03/09/2019 06:14 PM IST
Janasena announces rythu bandhu to farmers rs 8000 aid per acre

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్లను తమ వైపు అకర్షించుకునేందుకు ఎన్నికల బరిలో నిలిచే అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ పలు పథకాలను ప్రవేశపెట్టగా, అటు విపక్ష పార్టీ కూడా అనేక హామీలను గుప్పిస్తున్న క్రమంలో జనసేన పార్టీ కూడా తాము రైతుల పక్షాన వున్నామని చాటేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లుగా రైతు బంధు పథకాన్ని ప్రవేశపెడతామని హామి ఇచ్చింది.

అయితే రాష్ట్ర బడ్జెట్ ఎంత.? ఇబ్బడిముబ్బడిగా ఇస్తున్న పథకాలకు వెచ్చించే ధనమెంత.? అన్న లెక్కలు వేసుకున్న జనసేన పార్టీ.. తాము అధికారంలోకి వస్తే.. ప్రతి రైతు కుటుంబానికి ఎకరానికి రూ.8 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ రెండు అంశాలను పార్టీ మేనిఫెస్టోలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు.

‘రాష్ట్ర బడ్జెట్ రూ.2 లక్షల కోట్లు. నోటికి వచ్చినట్టు రూ.5 లక్షల కోట్ల హామీలు ఇచ్చి మోసం చేయడం ఇష్టం లేకే ప్రతి అంశంలో ఆచితూచి అడుగులు వేస్తున్నా’నని పవన్ తెలిపారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా నిలబెట్టుకుంటానని జనసేనాని చెప్పారు. రైతులకు ఆర్థిక సాయం నిర్ణయం వెనుక రైతు కుటుంబాల్లోని ఆడపడుచుల భద్రత కూడా దాగి ఉందని పవన్ తెలిపారు. పార్టీ పదవుల్లో 33 శాతం మహిళలకే ఇస్తామని జనసేనాని వెల్లడించారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇందుకోసం నిధులను కూడా కేటాయించింది. కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి ఒక్కో రైతు కుటుంబానికి రూ.15 వేల సాయం చేస్తామని బాబు ప్రకటించారు. ఇక దీనికి ధీటుగా అదే పథకాన్ని తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని వైసీపి అధినేత జగన్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తమ పార్టీ హామీలు అచరణకు వీలుగా వుంటాయని, ఇబ్బడిముబ్బడి హామీలు ఇచ్చే పార్టీ తమది కాదని పవన్ కల్యాణ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  farmer aid  rythu bandhu  andhra pradesh  politics  

Other Articles