nirav-modi-spotted-in-london లండన్ పోయెను.. వేషము మార్చెను.. అయినా..

Nirav modi spotted in london reportedly conducts business as usual

nirav modi, nirav modi video, nirav modi in london, nirav modi london, nirav modi video telegraph, nirav modi uk, nirav modi uk business, pnb scam, pnb scam nirav modi, nirav modi in uk, uk nirav modi, nirav modi london video, video nirav modi, nirav modi scam, nirav modi case, latest news

Fugitive diamantaire Nirav Modi, who is wanted in the multi-crore Punjab National Bank fraud in India, is living in a luxurious apartment situated in London’s West End and running a diamond business.

లండన్ పోయెను.. వేషము మార్చెను.. అయినా..

Posted: 03/09/2019 04:37 PM IST
Nirav modi spotted in london reportedly conducts business as usual

పంజాబ్ నేషనల్ బ్యాంకులోని ప్రజలధనాన్ని దోచుకుని దేశాన్ని వదలి విదేశాలకు పారిపోయిన అర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్ వేషాన్ని మర్చుకున్నా.. తాను చేస్తున్న వ్యాపారాన్ని మాత్రం వదులుకోలేదు. లండన్ నగరంలో కొత్త వ్యాపార సంస్థను ప్రారంభించినట్టు ది టెలిగ్రాఫ్ పత్రిక ఓ వీడియోను ప్రచురించింది. లండన్ వీధుల్లో భయంలేకుండా తిరుగుతోన్న నీరవ్‌‌ను గుర్తించిన టెలిగ్రాఫ్ జర్నలిస్ట్ ప్రశ్నల వర్షం కురిపించగా, అన్నింటికీ నో కామెంట్ అంటూ అతడు సమాధానం ఇవ్వడం గమనార్హం.

టెలిగ్రాఫ్ రిపోర్టర్ నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించిన నీరవ్, తొలుత ఓ క్యాబ్ ఎక్కేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ క్యాబ్ డ్రైవర్ నిరాకరించడంతో మరో క్యాబ్ సాయంతో అక్కడ నుంచి జారుకున్నాడు. అయితే తాను ఉన్నంత సమయంలో రిపోర్టర్ చకచకా పలు ప్రశ్నలను సంధించినా.. తనకు ఆ ఒక్క పదం తప్ప మరేమీ రాదన్నట్లుగా నో కామెంట్ అంటూ సమాధానాలు ఇచ్చి జారుకున్నాడు నిరవ్ మోదీ. ఆ తరువాత ఈ మొత్తం వ్యవహారాన్ని జర్నలిస్ట్ వీడియోగా చిత్రించడంతో నీరవ్ ఆచూకీ వెలుగుచూసింది.

లండన్ లోని వెస్ట్‌ ఎండ్‌ వీధిలో టెలిగ్రాఫ్‌ పాత్రికేయుడి కంటపడిన నీరవ్‌ మోదీ.. ఆ సమయంలో ధరించిన కోటు ఆస్ట్రిచ్ హైడ్ బ్రాండ్ కు చెందినదని, దాని విలువ దాదాపు 10,000 పౌండ్లు (సుమారు రూ.9 లక్షలు)గా ఉంటుందని అంచనా. ఇక ఆయన ప్రస్తుతం లండన్ లోని ఆక్స్‌ ఫర్డ్ వీధి సమీపంలో ల్యాండ్ మార్క్ సెంటర్ పాయింట్ టవర్ బ్లాకులోని ట్రిఫుల్ బెడ్ రూమ్ ప్లాట్ లో వుంటున్నారని.. అందులోంచి లండన్ నగరం వీక్షణం బాగా కనిపిస్తుందని కూడా ప్రచురించారు. ఇక ఈ ఫ్లాట్ అద్దె ఏకంగా 15 లక్షల రూపాయలని కూడా టెలిగ్రాఫ్ ప్రచురించింది.

తన నివాసానికి సమీపంలోనే సోహోలో వజ్రాల వ్యాపారం ప్రారంభించినట్టు కూడా టెలిగ్రాఫ్ తెలిపింది. ఇంటికి కాలినడక వెళ్లేంత దగ్గరగా దుకాణం ఉన్నట్లు సమాచారం. లండన్ లో వ్యాపారం చేయాలంటే నేషనల్‌ ఇన్సూరెన్స్ నంబర్‌ తప్పనిసరి. వేల కోట్లు మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయి వచ్చిన వ్యక్తికి నేషనల్‌ ఇన్సూరెన్స్ నంబర్‌ ఎలా వచ్చిందని కూడా వారు ప్రశ్నించారు. మీసాలు, గడ్డాలు పెంచి లావెక్కినట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనపిస్తోంది.

మరోవైపు, నీరవ్ కు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అయితే, తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు నీరవ్ మోదీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉంటాడని ప్రభుత్వ వర్గాలు, ఉన్నతాధికారులు భావిస్తున్నారు. గతేడాది మేలోనే నీరవ్ వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించాడని, లిస్టెడ్ కంపెనీల్లో ఖరీదైన వజ్రాలు పొదిగిన చేతి గడియారాలు, ఆభరణాలు అమ్మే హోల్‌సేల్, రిటెయిల్ సంస్థగా పేర్కొన్నట్టు తెలిపింది.

అంతేకాకుండా, ధనవంతులైన విదేశీయులకు సలహాలను ఇచ్చే పశ్చిమ లండన్‌లోని ఆర్థిక నిర్వహణ సంస్థతో కూడా అతడు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. కాగా, లండన్‌లో ఉన్న నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞ‌ప్తిపై బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. టెలిగ్రాఫ్ విడుదల చేసిన రెండు నిమిషాల నిడివిగల వీడియోను మీరూ వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nirav modi  london  telegraph  video  uk business  pnb scam  latest news  

Other Articles