Two militants killed in Pulwama encounter పుల్వామాలో ఇద్దరు ముష్కరులను హతం.. నక్కజిత్తులకు చెక్..

2 terrorists killed in encounter in jammu and kashmir s pulwama

Jammu kashmir, Pulwama, Encounter, Tral encounter, militant killed, CRPFJ&K police, Security Forces, terrorists

The security forces on Tuesday killed at least two Hizbul Mujahideen terrorists in an overnight encounter which broke out in Tral area of Pulwama district of Jammu and Kashmir.

పుల్వామాలో ఇద్దరు ముష్కరులను హతం.. నక్కజిత్తులకు చెక్..

Posted: 03/05/2019 12:38 PM IST
2 terrorists killed in encounter in jammu and kashmir s pulwama

జమ్మూకాశ్మీర్ పుల్వామా దాడి తరువాత.. పాకిస్థాన్ ఉగ్రవాద దాడుల్లో భారత భద్రతా దళాలు అధిక సంఖ్యలోనే జవాన్ల ప్రాణాలను కొల్పోతున్నాయి. జమ్మూకాశ్మీర్ లో వరుసగా జరగుతున్న ఎన్ కౌంటర్లలో పూల్వామా దాడి తరువాత సుమారు 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. పూల్వామా దాడి జరిగిన నాలుగురోజులకే ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో తనిఖీలు చేస్తున్న భద్రతా దళాలు ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులతో గంటల పాటుపోరాడి వారందరినీ హతమర్చారు.

అయితే ఓ ఉగ్రవాది మాత్రం చనిపోయినట్లుగా నటించి భారత భద్రతాదళాలపై తుపాకీతో తెగబడిన ఘటనలో ఒక మేజర్ సహా నలుగురు జవాన్లు మరణించిన విషయం కూడా తెలిపింది. రెండు రోజుల క్రితం రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో ఐదుగురు జవాన్లను కోల్పోవడం జరిగింది. ఉగ్రవాది నక్కజిత్తుల తెలివితో దొంగదెబ్బతీయడంతో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో నిన్న అర్థరాత్రి నుంచి పూల్వామాలోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతాదళాలు ఉగ్రవాదులు నక్కిన ఇంటినే పేల్చివేసి వారిని మట్టబెట్టాయి.

త్రాల్‌ ప్రాంతంలోని గోల్ మసీద్‌లో ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఉన్నారనే సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు చేశారు. చాలాసేపు ఇరువర్గాల మధ్య ఫైరింగ్ జరిగింది. చివరక భద్రతా బలగాలు ఆ ఇంటిని పేల్చేశాయి. ఈ ఎన్ కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కొద్దిసమయానికే మరో ఉగ్రవాదిని కూడా భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. మంగళవారం తెల్లవారుజామున 4.30గంటల నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.

పుల్వామా జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారింది. దీంతో భద్రతా దళాలు అక్కడ ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ముష్కరులను ఏరిపారేసే పనిని ముమ్మరం చేశారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా టెర్రరిస్టుల కోసం సెర్చింగ్, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తర్వాత... దాడి సూత్రధారులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇప్పుడు మరో ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా దాడి తర్వాత జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని భద్రతా దళాలు కంటిన్యూ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles