special railway zone to vishaka విశాఖకు రైల్వేజోన్ ప్రకటించిన కేంద్రం..

New railway zone for andhra to be headquartered in visakhapatnam

industry news, Southern Coast Railway, 2014 general elections, BJP leaders, Railway Minister, piyush goyal, railway zone, Railway Ministers of India, Government of India, Piyush Goyal, Goyal, India, Ujwal DISCOM Assurance Yojana, Rail Bhavan, Visakhapatnam, Railway Minister, general elections, Andhra Pradesh BJP, PM Modi, Chandrababu Naidu, BJP, Andhra Pradesh, politics

Railway Minister Piyush Goel has informed that the issue of setting up Visakhapatnam Railway Zone is at an advanced stage of consideration with the centre.

విశాఖకు రైల్వేజోన్ ప్రకటించిన కేంద్రం.. ఎల్లుండి ప్రధాని సభ

Posted: 02/27/2019 08:49 PM IST
New railway zone for andhra to be headquartered in visakhapatnam

ఉత్తరాంధ్రవాసుల స్వప్నం ఎట్టకేలకు సాకారమైంది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ కు కేంద్రం సుదీర్ఘకాలం తరువాత పచ్చజెండా ఊపింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ కోత్త రైల్వే జోన్ కు దక్షిణ కోస్తా రైల్వేజోన్ గా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లుడుతూ వివరాలను వెల్లడించారు. కొత్త జోన్ ఏర్పాటుపై సుదీర్ఘ అధ్యయనం చేశామని చెప్పిన ఆయన.. ఈ జోన్ పరిధిలో గుంతకల్, గుంటూరు, విజయవాడ డివిజన్లు వుంటాయని ప్రకటించారు.

ప్రస్తుత వాల్తేర్‌ డివిజన్ ను రెండు భాగాలుగా విభజిస్తామన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి.. ఒక భాగాన్ని విజయవాడ డివిజన్ లో కలిపి జోన్ లో ఉంచుతామని, మరో భాగాన్ని రాయగడ డివిజన్ గా మారుస్తున్నామని తెలిపారు. రాయగడ డివిజన్‌ ఈస్ట్ కోస్ట్‌ జోన్ లో భాగంగా ఉంటుందని గోయల్‌ వివరించారు. రైల్వే బోర్డుతో చర్చించి మిగిలిన నిబంధనలు రూపొందిస్తామని గోయల్‌ చెప్పారు. ఇక.. వాల్తేరు డివిజన్ ప్రస్తుతం ఈస్ట్‌కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో ఉంది. కాగా, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి.

దీంతో రాష్ట్ర పునర్విభజన హామీల్లో ప్రత్యేక హోదా తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన విశాఖ రైల్వే జోన్ కు ఎట్టకేలకు మోక్షం లభించినట్లు అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు రెండు రోజుల ముందు కేంద్రం ఈ కీలక ప్రకటన చేసింది. మార్చి 1న ప్రధాని నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు రానున్న సందర్భంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. అయితే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించడానికి ప్రధాన సమస్యగా ఉన్న వాల్తేరు డివిజన్ వ్యవహారానికి ఒక పరిష్కారం చూసిన తరువాతే... కొత్త జోన్ ఏర్పాటుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఆంధ్ర ప్రదేశ్ కి రైల్వే జోన్ ఏర్పాటుకు అభ్యంతరం లేదని చెబుతూ వచ్చిన ఒడిశా... తమ రాష్ట్రానికి చెందిన తూర్పుకోస్తా రైల్వేలో భాగమైన వాల్తేరు డివిజన్ విభజన మాత్రం అంగీకరించమని మెలిక పెట్టింది. వాల్తేరు డివిజన్ ను ఏపీకి కేటాయిస్తే, తూర్పుకోస్తా జోన్ నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉందన్నది ఒడిశా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే రైల్వే డివిజన్లలో వాల్తేరు మూడో స్థానంలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో విధివిధానాలు ఏలా రూపోందిస్తారన్న విషయం వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles