Pakistan PM calls meeting on nuclear issues అణ్వాయుధాల టీమ్ తో పాకిస్థాన్ ప్రధాని సమావేశం..

Pakistan pm calls meeting of top decision making body on nuclear issues

IAF Air Strikes in Pakistan, Pakistan Air Force's F-16 shot down, Indian Air Force, Pakistan's F-16 jet, Imran Khan, Pak PK Imran Khan Nuclear tops meet, Mohammad Faisal, Pakistan's MoFA spokesperson, PAF undertook strikes across LoC, Pakistani airspace. Pakistan, INDIA, Pak-IND border situation

Pakistan Prime Minister Imran Khan called a meeting of the top decision-making body on nuclear issues after India targeted terrorist camp in the country.

అణ్వాయుధాల టీమ్ తో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సమావేశం..

Posted: 02/27/2019 02:28 PM IST
Pakistan pm calls meeting of top decision making body on nuclear issues

ఓ వైపు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. మరోవైపు భారత్ భూభాగంలోకి చొచ్చుకెచ్చేందుకు పూర్తి సహకారం అందించి భారత భద్రతా బలగాలపై కాల్పులు జరుపేలా ప్రోత్సహిస్తుంది దాయాధి. అంతేకాదు భారత్ లోకి చోరబాట్లకు ప్రేరణిస్తున్న పాకిస్తాన్ కు పూల్వామాలో భారత బలగాలపై మానవబాంబు దాడి జరపి 48 మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో పాక్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఉన్న భూమిపై భారత్ వైమానిక దాడులకు దిగిన నేపథ్యంలో, ఏదో ఒకటి చేసి తమ ఉనికిని చాటుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వున్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ నేషనల్ కమాండ్ అథారిటీని అత్యవసర సమావేశానికి పిలిచారు. పాకిస్థాన్ అణ్వాయుధాలను ఈ కమాండ్ అథారిటీయే నిర్వహిస్తుంది. కాగా, భారత వాయుసేన ఖాళీ ప్రాంతంలో బాంబులు విడిచిందని, ప్రాణనష్టం లేదని నిన్న ప్రగల్భాలు పలికిన పాకిస్థాన్, ఆపై తాము కూడా ఇండియాకు సర్ ప్రైజ్ ఇస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా యుద్ధ వాతావరణం ఏర్పడగా, పాక్ ప్రధాని నేడు అణ్వాయుధాల టీమ్ తో సమావేశం నిర్వహించడం గమనార్హం.

కాగా, పాకిస్థాన్ అణు బాంబులతో దాడి చేస్తుందని భావించాల్సిన అవసరం లేదని మాజీ దౌత్యాధికారి కేసీ సింగ్ అభిప్రాయపడ్డారు. నేషనల్ కమాండ్ అథారిటీని సమావేశానికి పిలవడం కేవలం ఓ ఎత్తుగడ మాత్రమే కావచ్చని, తాము కూడా ఏదైనా చేయగలమన్న సంకేతాలు ఇచ్చేందుకే ఇమ్రాన్ ఈ పని చేసుండవచ్చని ఆయన అన్నారు. పాకిస్థాన్ ఒక్క బాంబు ఇండియాపై వేస్తే, 20 బాంబులు వచ్చి పాక్ పై పడతాయని మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Air Force  F-16 jet  Imran Khan  Nuclear meet  Pakistan  INDIA  Pak-IND border situation  

Other Articles