IAF shoots down Pakistan's F-16 jet ఫాక్ యుద్దవిమానం కాల్చేసిన ఐఏఎఫ్..

Indian air force shoots down pakistan f 16 fighter jet report

IAF Air Strikes in Pakistan, Pakistan Air Force's F-16 shot down, Indian Air Force, Pakistan's F-16 jet, Imran Khan, Mohammad Faisal, Pakistan's MoFA spokesperson, PAF undertook strikes across LoC, Pakistani airspace. Pakistan, INDIA, Pak-IND border situation

Pakistan Air Force's F-16 that violated Indian air space shot down in Indian retaliatory fire 3KM within Pakistan territory in Lam valley, Nowshera sector. Sources saying that Pak pilot captured and handovered to police

ఫాక్ యుద్దవిమానం కాల్చేసిన ఐఏఎఫ్.. అదువులో ఫైలెట్..

Posted: 02/27/2019 12:23 PM IST
Indian air force shoots down pakistan f 16 fighter jet report

పాకిస్థాన్ కు ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని భారత బలగాలు కూల్చివేశాయి. భారత గగన తలంలోకి వచ్చిన ఈ విమానంపై భారత బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో, అది వెనుదిరిగి వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ లోని నౌషరా సెక్టార్ కు అవతలి వైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న లామ్ వ్యాలీలో 3 కిలోమీటర్ల దూరంలో విమానం కుప్పకూలిపోయింది. విమానం కుప్పకూలడంతో పైలట్ ప్యారాషూట్ ద్వారా కిందకు దిగినట్లు కనిపించింది. అయితే పైలట్ ను అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు స్థానిక పోలీసులకు అప్పగించింది.

జమ్మూకశ్మీర్ లోని నౌషేరా సెక్టార్ లోకి దూసుకోచ్చిన పాక్ యుద్ధ విమానాలు.. భారత వాయుసేన(ఐఏఎఫ్) ఫైటర్ జెట్లు వెంబడించడంతో పలాయనం చిత్తగిస్తూ కూడా తమ వక్రబుద్దిని బయటపెట్టుకున్నాయి. పారిపోయే ముందు భారత భూభాగంపై బాంబు దాడులు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈ దాడిలో పౌరులు, ఆర్మీ సిబ్బంది ఎవరైనా చనిపోయారా? ఎంత నష్టం వాటిల్లింది? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నిన్న చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ లో పాకిస్థాన్ లోని బాలాకోట్ లో 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

అయితే పాక్ ఎఫ్ 16 యుద్దవిమానం కూల్చివేసిన నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ స్పందించారు. తమ విమానాలు వాస్తవాధీన రేఖ వెంబడి మాత్రమే ప్రయాణించాయని, తమ భూభాగంలోనే బాంబులను జార విడిచామని ప్రభుత్వం తరఫున ఓ అధికారిక ప్రకటన విడుదలైంది. స్వీయ రక్షణకు తాము సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు పంపేందుకే ఈ పని చేశామని తెలిపింది. ఇండియా మాదిరిగా తాము రాత్రిపూట రాలేదని, పట్టపగలే వచ్చామని తెలిపింది. ఇదేమీ ప్రతీకార చర్య కాదని, మిలటరీని లక్ష్యంగా చేసుకోలేదని, సామాన్యులను టార్గెట్ చేయలేదని తెలిపింది. తాము ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే, పరిస్థితి ఇలా ఉండదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పరిస్థితి యుద్ధం వైపు వెళ్లేలా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles