Hooch tragedies kill 69 in Assam కాటేసిన కల్తీ మద్యం.. అసోంలో 69 మంది మృతి..

Assam hooch tragedy 69 tea garden workers dead govt orders probe

69 dead in Assam, Anjum Moudgil, Apurvi Chandela, Assam liquor deaths, Assam, hooch, Hooch tragedy, spurious liquor, Assam tragedy, crime

Sixty nine tea garden workers died after consuming spurious liquor in Assam, with 39 deaths reported from Golaghat district alone. Several others have been admitted in a critical condition at the Jorhat Medical College Hospital and at the Golaghat civil hospital.

కాటేసిన కల్తీ మద్యం.. అసోంలో 69 మంది మృతి..

Posted: 02/23/2019 01:20 PM IST
Assam hooch tragedy 69 tea garden workers dead govt orders probe

అసోంలో మరో విషాదం అలుముకుంది. విషపూరిత మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 69కి చేరుకుంది. ఈ ఘటనలో ఒక్క గోలాఘాట్‌ లోనే 39 మరణాలు సంభవించాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన వేడుకలో భాగంగా తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు ఈ కలుషిత మద్యంసేవించి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పక్షం రోజుల కిందటే ఈశాన్య రాష్ట్రంలో కల్తీమద్యానికి సుమారు 100 మందికి పైగా బలైన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన నమోదు కావడం పెను విషాదాన్ని నింపింది.

గోలాఘాట్ లోని సల్మారా టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న కూలీలు తమకు కూలీ వచ్చిన సందర్భంగా వేడుక చేసుకున్నారు. ఇందుకోసం స్థానికంగా ఉండే సంజు ఒరాంగ్‌ అనే వ్యక్తి నుంచి మద్యం తీసుకొచ్చారు. మద్యం సేవించిన కాసేపటికే నలుగురు మహిళలు కుప్పకూలారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటికి ఈ ఘటన మృతుల సంఖ్య 69కు చేరుకుంది. ఈ ఘటనలో మద్యం అమ్మిన వ్యక్తి సంజు ఒరాంగ్‌, అతడి తల్లికూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

స్థానిక టీ ఎస్టేటు తోటల్లో పనిచేసే వారికి వారానికోసారి కూలీలు ఇస్తుంటారు. ఇలా కూలీలు అందిన క్రమంలో వారంతా ఒక్కచోటుకు చేరకుని వేడుకలు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఒక్కోగ్లాసు మద్యం రూ.10, రూ.20లకు దుకాణ యజమాని సంజు అమ్మాడని దీంతో కొందరు స్థాయికి మించి మద్యం సేవించారని స్థానికులు పేర్కొన్నారు. అయితే మద్యం తాగిన తరువా వారంతా వాంతులు చేసుకున్నారని, కోందరు అక్కడే కుప్పకూలారని స్థానికులు తెలిపారు.

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి పరిమళ్‌ శుక్లాబైడ్యా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో అలసత్వం వహించినందుకు గానూ ఇద్దరు ఎక్సైజ్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మద్యాన్ని రసాయనాల క్యాన్‌లో తీసుకురావడం వల్లే అది విషపూరితమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా ఉన్న జూగీబారీ ప్రాంతంలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న ఇందుకల్పా బోర్డాలోయ్‌, దేబాబోరాలను పోలీసులు అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam  hooch  Hooch tragedy  spurious liquor  Assam tragedy  crime  

Other Articles