Leopard spotted at Thane shopping mall caught షాపింగ్ మాల్ లో షాకింగ్ వీడియో.. ఎట్టకేలకు దొరికింది..

Leopard spotted at thane shopping mall caught after 6 hrs

Panther in mall, Maharashtra mall, Panther Maharashtra mall, Panther, Panic, Panther, Thane Shopping Mall, Korum Mall, Hotel Basement, Thane, maharashtra, politics

A panther was spotted at a popular shopping mall and at a hotel in Thane city of Maharashtra on Wednesday morning, triggering panic among people. CCTV cameras showed the panther hiding behind a staircase, before running into a dark corridor.

ITEMVIDEOS: షాపింగ్ మాల్ లో షాకింగ్ వీడియో.. ఎట్టకేలకు దొరికింది..

Posted: 02/20/2019 06:45 PM IST
Leopard spotted at thane shopping mall caught after 6 hrs

మహారాష్ట్రలోని ఠాణే లో ఒక ఘటన అందరినీ బెంబేలెత్తించింది. ఠాణేలోని ఒక షాపింగ్ మాల్..కోరమ్ మాల్ లో ఒక చిరుత చొరబడింది. ఎక్కడో ఒక మూల నక్కి ఉండకుండా స్వేచ్ఛగా మాల్ అంతా తిరుగాడింది. మాల్ మెట్లెక్కి తిరిగింది. ఇదిచూసి అంతా భయంతో వణికిపోయారు. మాల్ లో చిరుత విహారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఉదయం దాదాపు 5.30 గంటల సమయంలోనిది. సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో ఫారెస్ట్ అధికారులు, పోలీసులు ఆ చిరుతను పట్టుకొనేందుకు రంగంలోకి దిగారు.

సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ ప్రదీప్ గిరిధర్ మేరకు ఆ చిరుత హోటల్ సత్కార్ బేస్ మెంట్ లో కనపించింది. దానిని పట్టుకొనేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఫారెస్ట్‌ రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొంది. ముందుగా మాల్ నుంచి బయటికి వచ్చేవారు చిరుతను చూసి పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు అది మాల్ పార్కింగ్ లో తిరిగింది. చిరుత మాల్ ప్రహరీ గోడను దూకి లోపలికి ప్రవేశించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

వీడియోలో మాల్ లో తిరుగుతున్న చిరుత స్పష్టంగా కనిపిస్తోంది. మెట్లపై ఎగిరి దూకుతూ పైకి వెళ్లింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. కొంతసేపు మాల్ లో తిరిగిన తర్వాత అది ఒక హోటల్ బేస్ మెంట్ లోకి వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. చిరుత రావడంతో ఠాణే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు సుమారుగా ఆరు గంటల పాటు శ్రమించి దానిని ఎట్టకేలకు బంధించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Panic  Panther  Shopping Mall  Korum Mall  Hotel Basement  Thane  Maharashtra  

Other Articles