Jagan media spreads hate campaign against me: chintamaneni దళితులు, వైసీపీకి పోటీగా చింతమనేని ధర్నా..

Chintamaneni stages protest on ycp spreading hatred and morphed speech

competative dharna between ruling and opposition party at eluru, TDP vs YCP dharna at eluru, social media, sakshi, tdp, chintamaneni prabhakar, cross link, ex-latest, Dharna, Protest, Eluru, Andhra Pradesh, Politics

TDP Dendulu MLA Chintamaneni Prabhakar had staged a protest at Eluru, which alerted police to rush in large number to the spot as the two political parties stage Dharna at same place, He demanded action against the YCP leaders for spreading hate campaign against him.

ఏలూరులో రగడ.. దళితులు, వైసీపీకి పోటీగా చింతమనేని ధర్నా..

Posted: 02/20/2019 03:13 PM IST
Chintamaneni stages protest on ycp spreading hatred and morphed speech

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, టీడీపీ విఫ్.. చింతమనేని ప్రభాకర్.. ఏలూరులో తన అనుచరవర్గంతో ధర్నాకు దిగారు. తనపై ప్రతిపక్ష పార్టీ నేతలు నెట్టింట్లో దుష్ప్రచారం చేస్తున్నారన్ని అరోపిస్తూ.. ఈ ప్రచారంపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తన నియోజకవర్గం దెందులూరులోని ఏలూరు వద్ద ఆయన ధర్నాకు దిగారు. అయితే అప్పటికే ఆయన తమను అసభ్యపదజాలంతో దూషించారని.. తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళితులు, వారికి మద్దతుగా వైసీపీ నేతలు ధర్నాకు దిగిన ప్రాంతానికి చేరకుని చింతమనేని ధర్నాకు దిగారు.

ఇదిలా వుండగా ప్రస్తుతం రాష్ట్రంలోని వైసీపీ సర్కిళ్లలో చింతమనేనికి చెందిన ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఆయన దళితుల్ని అసభ్య పదజాలంతో దూషించారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’అంటూ ఎమ్మెల్యే దూషించిన ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేశారు. గత నెల మొదటివారంలో పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో నిర్వహించిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. అదే సమయంలో జగన్ పశ్చిమ గోదావరి పాదయాత్ర ముగిడంతో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దళిత సంఘాలు, వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. చింతమనేనిపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏలూరు ఫైర్ స్టేసన్ సమీపంలో ధర్నాకు దిగారు. టీడీపీ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని.. చంద్రబాబు చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. దళిత సంఘాలకు వైసీపీ నేతలు కూడా మద్దతు పలికారు. అయితే దళిత సంఘాలను తాను దూషించలేదని.. కావాలని ఎన్నికల సమయంలో తన ప్రతిష్టను దిగజార్చేందుకే వైసీపీ ఈ కుతంత్రాలకు తెరలేపుతుందని ఆయన అరోపించారు.

అంతటితో ఆగని ఆయన రోజురోజుకు తనపై విమర్శలు పేరుగుకుపోతున్న క్రమంలో ఇక చేసేది లేక.. స్వయంగా చింతమనేని కూడా ఏలూరులో అనుచరులతో కలిసి పోటీగా ధర్నాకు దిగారు. సోషల్‌మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారని ఆరోపించారు. ఇరు వర్గాలు పోటీగా ధర్నాలకు దిగడంతో.. భారీగా పోలీసుల్ని మోహరించారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని.. వీడియోను ఎడిట్ చేశారని చింతమనేని జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారట.

చింతమనేని అంతకముందు ఏలూరులోని సాక్షి కార్యాలయానికి కూడా వెళ్లారు. తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వీడియోలతో.. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా వార్తలు ఎందుకు రాస్తున్నారంటూ నిలదీశారట. ఆయన అన్న మాట్లలు ఇలా వున్నాయి.. ‘‘రాజకీయాంగా మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కటే.. మీరు దళితులు.. మీరు వెనుకబడినటుంవటి వాళ్లు.. మీరు షెడ్యూల్డు కాస్టు వారు.. రాజకీయాలు మాకుంటాయ్.. మాకు పదవులు.. మీకెందుకురా పిచ్చి..కోడుకుల్లారా కొట్లాటా.. కడుపు తీపితో మీ పిల్లల్ని పెంచుకోడానికి.. ఏ రకంగా బాగుపడాలో అలోచించాల్సింది తప్పా.. అంటూ సాగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : social media  sakshi  tdp  chintamaneni prabhakar  Dharna  Protest  Eluru  Andhra Pradesh  Politics  

Other Articles