re-postmortem for jyothi's body today ఎమ్మార్వో సమక్షంలో జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం..

Angadi jyothi s murder case two cops suspended s i sent to v r

chenchu srinivas, angadi jyothi, guntur police, srinivas friends, mahanadu, amaravathi stadium, Fields, sexual assault, gang rape, iron rods, sticks, Thadepally, Andhra Pradesh, Guntur, Angadi Jyothis murder case, Mangalagiri, crime

Guntur urban police suspended two constables for dereliction of duties in Angadi Jyothi's murder case. Mangalagiri rural S.I. Babu Rao sent to V.R and issued orders to this effect.

ఎమ్మార్వో సమక్షంలో జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం..

Posted: 02/14/2019 11:59 AM IST
Angadi jyothi s murder case two cops suspended s i sent to v r

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అంగడి జ్యోతి హత్యకేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ హత్యకేసులో జ్యోతి ప్రియుడు చెంచు శ్రీనివాస్ పై అమె బంధువులు అనేక అరోపణలు చేస్తున్న క్రమంలోనూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేసిన ఉన్నతాధికారులు.. మంగళగిరి రూరల్ ఎస్ఐ బాబురావుపై బదిలీ వేటు వేశారు. సిఐ బాలాజీ ఉన్నతాధికారులకు పంపిన నివేదిక ఆధారంగా పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

కాగా, ఈ కేసులో సర్కిల్ ఇన్స్ పెక్టర్ బాలజీపై కూడా చర్యలు తీసుకోవాలని జ్యోతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు తమ సోదరి పోస్టుమార్టం లో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్వవహరించారని అరోపించిన బంధువలు.. అమె మృతదేహానికి మరోమారు పోస్టుమార్టం నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే బంధువుల డిమాండ్ పై స్పందించిన పోలీసులు ఇవాళ జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎమ్మార్వో, ఉన్నతాధికారుల సమక్షంలో ఇవాళ మరోమారు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

జ్యోతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె ఒంటిపై దుస్తులను పోలీసులు సేకరించకుండానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ఆ తర్వాత నాలుక్కరుచుకున్న పోలీసులు శాస్త్రీయ ఆధారాల సేకరణకు దుస్తులు అత్యంత కీలకం కావడంతో అవి కావాలంటూ జ్యోతి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీనిని తీవ్రంగా పరిగణించిన ఎస్పీ.. ఎస్సై, సీఐలను సస్పెండ్ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chenchu srinivas  angadi jyothi  guntur police  C.I. Balaji  Andhra Pradesh  Crime  

Other Articles