shikha choudhary open up on jayaram.? మేనమామే లైంగిక దాడి.. జయరం హత్య కేసు కొలిక్కి..

Rakesh reddy confessed his offence in chigurupati jayaram s murder case

coastal bank partner jayaram, chigurupati jayaram, Jayaram murder case, jayaram suspisious death, coastal bank, niece shikha choudhary, DSP Bos, rakesh reddy, murder case, Nandigama police, crime

The prime accused in NRI Telugu industrialist Chigurupati Jayaram's murder case, Rakesh Reddy has confessed before police that he has killed Jayaram. AP Police higher officials yet to confirm this.

మేనమామే లైంగిక దాడి.. జయరం హత్య కేసు కొలిక్కి..

Posted: 02/04/2019 03:14 PM IST
Rakesh reddy confessed his offence in chigurupati jayaram s murder case

కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ కొలిక్కివచ్చింది., ఈ హత్యకేసులో అసలు నిందితులను పట్టుకున్నామని నందిగామ డీఎస్పీ బోస్ తెలిపారు. జయరాం హత్య కేసు విచారణ పూర్తికావస్తుందని అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసు విచారణ రమారమి పూర్తికావచ్చిందని.. ఈ కేసులో అసలు నిందితులను పట్టుకున్నామని అన్నారు.

ఇవాళ సాయంత్రం లేదా రేపు మీడియా ఎదుట నిందితులను ప్రవేశపెడుతామని అన్నారు. ఇక శిఖా చౌదరి తమ అదుపులో వున్నట్లు వస్తున్నా వార్తలో నిజం లేదని చెప్పారు. మీడియాలో చూపించిన శిఖా చౌదరి ఫొటో కూడా తమ వద్ద తీసింది కాదని డీఎస్పీ స్పష్టం చేశారు. జయరాం హత్యకేసు విచారణ అత్యంత వేగంగా మూడు రోజుల్లోనే తేల్చామని చెప్పారు.

ఈ కేసులో దర్యాప్తులో తమకు ఎవరి వత్తిళ్లు లేవని, ఎవరికీ అనుకూలంగా పనిచేయలేదని చెప్పారు. కేసు వివరాలను మీడియాకు లీక్ చేశారని ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అయితే శాఖాపర బదిలీలు జరిగి వుండచ్చునన్నారు. కేసు ముగింపు ధశకు చేరుకోవడంతో నిందితుల పేర్లు వెల్లడించలేమని ఆయన అన్నారు.

జయరాంపై శిఖా సంచలన అరోపణలు

ఇదిలావుండగా, తన మేనమామ చిగురుపాటి జయరాంపై ఆయన మేనకోడలు శిఖా చౌదరి సంచలన అరోపణలు చేసింది. జయరాం హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. తన మామయ్య జయరాం వ్యక్తిగతంగా మంచోడు కాదని అరోపించిన ఆమె తనతో పాటు తన చెల్లిని కూడా జయరాం లైంగికంగా వేధించాడని తెలిపింది. తన చెల్లికి జయరాం మెడికల్‌ సీట్‌ ఇప్పించాడని అయితే ఆయన వేధింపులు తట్టుకోలేక అమె దూరంగా ఉంటోందని తెలిపింది. మేనకోడలినైన తనతోనూ శారీరక సుఖం కోరుకునేవాడని అరోపించింది.

తనకు రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. ఇద్దరితో విడాకులు తీసుకున్నానని శిఖా చెప్పింది. రాకేశ్ రెడ్డితో డేటింగ్‌ చేశానని..పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నా.. కానీ జయరాం వల్ల దూరం కావాల్సి వచ్చిందని తెలిపింది. జయరాంకి రాకేశ్ ను తానే పరిచయం చేశానని చెప్పింది. జయరాంకు రాకేశ్ రూ.4.5కోట్లు అప్పు ఇచ్చాడని కూడా చెప్పింది. అయితే చెక్ పవర్‌ అత్త చేతిలో ఉండటం వల్ల మామయ్య అప్పులు కట్టేందుకు ఇబ్బందులు పడ్డాడని చెప్పింది. సకాలంలో అప్పులు కట్టకపోవడంతో రాకేశ్ కు తనకు తరుచు గొడవలు జరిగేవని చెప్పింది. దీంతో మామయ్య జయరాంపై రాకేశ్‌ కోపం పెంచుకున్నాడు.

హత్య జరిగిన రోజు శ్రీకాంత్ తో వికారాబాద్ కు లాంగ్‌ డ్రైవ్ కి వెళ్లానని.. ఉదయం 6 గంటలకు అమ్మ ఫోన్‌ చేస్తే కానీ తనకు విషయం తెలియదని చెప్పింది. తాను.. శ్రీకాంత్‌ కలిసి మామయ్య ఇంటికి వెళ్లి.. జగ్గయ్య పేటలో తనకు రాసిచ్చిన 10 ఎకరాల భూమి పత్రాలు వెతికమని అంగీకరించింది. తర్వాత మామయ్యను చూడటానికి బెజవాడ వెళ్లాగా.. అప్పుడే నందిగామ పోలీసులు తనకు ఫోన్‌ చేసి విచారణకు రమ్మన్నారని చెప్పింది. రాకేశ్‌ రెడ్డి మామయ్యను చంపుతాడని అనుకోలేదని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chigurupati jayaram  coastal bank  niece shikha choudhary  rakesh reddy  DSP Bos  murder case  crime  

Other Articles