ED issues notices to Vem Narender Reddy in cash for vote case ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు

Ed issues notices to vem narender reddy in cash for vote case

Vem Narender Reddy, enforcement directorate, cash for vote case, vote for note, chandrababu, Telangana, crime, politics

Enforcement directorate officials issues notices to congress leader vem Narender Reddy to attend before them in a week.

ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు..

Posted: 02/01/2019 07:35 PM IST
Ed issues notices to vem narender reddy in cash for vote case

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికలలో అంగ్లో ఇండియన్ స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురి చేసి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు చేసిన ప్రయత్నాలను ఏసీబి అధికారులు రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్టు కూడా అయ్యారు. ప్రస్తుతం ఆయన ఈ కేసులో బెయిల్ పై వున్న విషయం తెలిసిందే.

కాగా, సుమారు ఐదేళ్ల వరకు అటకెక్కిన ఈ కేసు మరోమారు తెలంగాణలో తన ఉనికి చాటుకుంటుంది. ఈ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. శుక్రవారం ఈడీ అధికారులు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఉన్న నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అలాగే రూ.50లక్షలపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

2015లో ఈ ఓటుకు నోటు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ కేసులో అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేందర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. గతంలో ఆయన తెలంగాణ ఏసీబీ అధికారుల విచారణకు కూడా హాజరయ్యారు. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు పంపారు. ఓటుకు నోటు కేసు సమయంలో నరేందర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాలతో రేవంత్ రెడ్డితో పాటూ కాంగ్రెస్‌లో చేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles