Budget To Have Implications on Polls: Manmohan Singh ‘‘మధ్యంతర బడ్జెట్ కాదు.. ఎన్నికల తాయిలాల బడ్జెట్’’..

Budget an account of votes not vote on account p chidambaram

budget 2019, budget 2019, budget, economic survey 2019, Interim budget, Union budget, rahul gandhi, manmohan singh, chidambaram, union budget 2019, piyush goyal, budget 2019 expectations, interim budget 2019, interim budget 2019 High lights, finance minister of india 2019, finance minister of india, vote on account, politics

Former Finance Minister and Congress veteran P. Chidambaram on Friday described the Interim Budget as an "Account for Votes" and not a Vote on Account and said the Modi government has further weakened fiscal stability.

‘‘మధ్యంతర బడ్జెట్ కాదు.. ఎన్నికల తాయిలాల బడ్జెట్’’..

Posted: 02/01/2019 05:47 PM IST
Budget an account of votes not vote on account p chidambaram

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శలు గుప్పించారు. మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ఈ బడ్జెట్ ప్రభావం చూపుతుందని మండిపడ్డారు. ఎన్నికల తాయిలాలు ఇస్తున్నట్టుగా బడ్జెట్ ఉందని.. ఇది ముమ్మాటికీ ఎన్నికల బడ్జెట్ అంటూ మండిపడ్డారు. రైతులు, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ఎన్నికలపై ప్రభావం చూపుతుందని చెప్పారు.

గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎన్డీయే మధ్యంతర బడ్జెట్ లో పోందుపర్చాడం వారి చిత్తశుద్దికి అద్దం పడుతుందని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ఇక మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టింది తాత్కాలిక బడ్జెట్ కాదని, ఎన్నికల తాయిలమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం విమర్శించారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ఎన్నికల సమాయత్తాన్ని తలపించిందని సెటైర్లు విసిరారు.

గ్రామాల్లో ఇళ్లకు విద్యుద్దీకరణ పూర్తి స్థాయిలో జరగలేదని, పేదలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లను అందించినా.. వారికి గ్యాస్ సిలండర్లను కొనుగోలు చేయడం భారంగా మారిందని అన్నారు. యువతకు ముద్ర రుణాలు ఆశించిన స్థాయిలో లేవని, పేదలకు మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో నిర్మించలేదని అన్నారు. ఐదేళ్లు గడిచినా.. ప్రధాని నరేంద్రమోడీ గత ఎన్నికలకు ముందు రూ.15 లక్షల ప్రజల అకౌంట్లలోకి వేస్తామన్న విషయం మర్చిపోయి.. అందుకు తాయిలాలు ప్రకటించారని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Interim budget  Union budget  rahul gandhi  manmohan singh  chidambaram  politics  

Other Articles