Israeli company claims to have a cure for cancer కేన్సర్‌ ను నిర్మూలించే బ్రహ్మాస్త్రం.. వెంటనే విమర్శలు

An israeli company claims to have a cure for cancer

Israeli company, cancer cure, cancer research, Accelerated Evolution Biotechnologies, no side-effects, pre-clinical trials, Morad, fellow scientists

A team of scientists at a biotech company in Israel claimed that they will have a cure for all cancer, A new treatment being developed by the company would offer a complete cure for cancer with “no or minimal side-effects at a much lower cost.

కేన్సర్‌ ను నిర్మూలించే బ్రహ్మాస్త్రం.. వెంటనే విమర్శలు

Posted: 02/01/2019 04:09 PM IST
An israeli company claims to have a cure for cancer

ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మందిని కబళిస్తున్న కేన్సర్‌ మహమ్మారిని నిర్మూలించే బ్రహ్మాస్త్రం దొరికిందా? కేన్సర్‌ను పూర్తిగా నయం చేసే చికిత్స అందుబాటులోకి రానుందా? ఇజ్రాయెల్‌కు చెందిన ‘యాక్సిలరేటెడ్‌ ఎవల్యూషన్‌ బయోటెక్నాలజీస్‌’ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నారు. కీమో థెరపీ, రేడియేషన్‌.. ఇలా ఎన్ని చేసినా కేన్సర్‌ రోగుల ప్రాణాలకు గ్యారెంటీ లేని పరిస్థితి నుంచి వాడిన తొలి రోజు నుంచే ఫలితాలను చూపే చికిత్సను తాము రూపొందించామని వారు చెబుతున్నారు.

అంతేకాదు ఈ చికిత్స వల్ల.. కీమో, రేడీయేషన్‌ లాగా ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని స్పష్టం చేస్తున్నారు. ఈ చికిత్స గురించి.. యాక్సిలరేటెడ్‌ ఎవల్యూషన్‌ బయోటెక్నాలజీస్‌ సీఈవో డాక్టర్‌ ఇలాన్‌ మొరాద్‌ ‘జెరూసలెం పోస్ట్‌’ వార్తాసంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
 
ఏమిటా చికిత్స: కేన్సర్‌ను నయం చేసేందుకు తాము రూపొందించిన చికిత్సను మల్టీ-టార్గెట్‌ టాక్సిన్‌ (మ్యుటాటో) థెరపీగా వ్యవహరిస్తున్నట్టు మొరాద్‌ తెలిపారు. బ్యాక్టీరియా వల్ల ఏదైనా అనారోగ్యం వస్తే.. యాంటీబయాటిక్‌లు దాన్ని ఎంత సమర్థంగా నయం చేయగలవో ఈ మ్యుటాటో చికిత్స కూడా అలాగే ‘కేన్సర్‌ యాంటీబయాటిక్‌’గా పనిచేస్తుందని ఆయన వివరించారు. ఈ చికిత్సలో భాగంగా తాము ఉపయోగించే ‘కేన్సర్‌ టార్గెటింగ్‌ పెప్టైడ్‌’లు.. కేన్సర్‌ కణాలు ఉత్పరివర్తనం చెందకుండా చేస్తాయని వెల్లడించారు.
 
ఈ పెప్టైడ్‌లు కేన్సర్‌ కణాలపై మూడు వైపుల నుంచి దాడి చేసి వాటిని నిర్వీర్యం చేస్తాయని వివరించారు. తాము ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఈ చికిత్స అద్భుత ఫలితాలనిచ్చిందని చెప్పారు. దీనికి ఎక్కువ ఖర్చు కూడా కాదని వివరించారు.
 
విమర్శల వెల్లువ: కేన్సర్‌ను నయం చేసే చికిత్స అంటూ ఇజ్రాయెల్‌ కంపెనీ చేసిన ప్రకటనను ప్రపంచవ్యాప్తంగా పలువురు ఆంకాలజిస్టులు విమర్శిస్తున్నారు. ఆ సంస్థ తన ప్రయోగాలను కేవలం ఎలుకలపైనే చేసిందని.. మనుషులపై ఇంకా ప్రయోగాలు చేయనే లేదని వారు గుర్తుచేస్తున్నారు. ఇది కేన్సర్‌ రోగుల్లో అనవసరంగా ఆశలు పెంచడమేనని.. మొరాద్‌ తీరు బాధ్యతారహితంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles