annual income support for 12 crore small farmers రైతులు, అసంఘటిత కార్మికులకు కేంద్రం తాయిలం

Piyush goyal promises annual income support for 12 crore small farmers

budget 2019, budget 2019 date, budget, economic survey 2019, union budget 2019, piyush goyal, budget 2019 expectations, interim budget 2019, interim budget 2019 High lights, finance minister of india 2019, finance minister of india, budget 2019 time, interim meaning, vote on account, budget 2019 india, 2019 budget date, India budget 2019-20, when is budget 2019, interim budget meaning, union budget, what is interim budget, budget timing, budget news

In a bid to woo farmers, Finance Minister Piyush Goel made a landmark announcement of providing Rs 6,000 as assured income to poor and marginalised farmers annually.

రైతులు, అసంఘటిత కార్మికులకు కేంద్రం తాయిలం

Posted: 02/01/2019 12:38 PM IST
Piyush goyal promises annual income support for 12 crore small farmers

ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు దేశంలోని రైతులను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కేంద్ర అర్థిక మంత్రి పియూష్ గోయల్ ఇవాళ పార్లమెంటులో ప్రేవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జట్ లో రైతులపై వరాలు కురిపించారు. ఇకపై దేశంలోని రైతులకు ప్రతీ ఏటా ఆరు వేల రూపాయలను పెట్టబడి సాయంగా అందించనున్నారు. ఈ పథకాన్ని అమలు పర్చేందుకు కిసాన్ సమ్మాన్ నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది.

2 హెక్టార్లు లోపల అంటే ఐదు ఏకరాల లోపు వ్యవసాయ భూమి వున్న రైతులకు ఈ కొత్త పథకం వర్తించనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సాయంతో సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమ కానుంది. మూడు విడతలుగా ఈ డబ్బును కేంద్రం రైతులకు అందించనుంది. ఈ పథకంతో దేశంలోని అన్ని 12 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరనుందని మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఇదే క్రమంలో కార్మికుల గ్రాట్యుటీ పరిమితిని కూడా 30 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.

కొత్త పెన్షన్ విధానం సరళీకరిస్తామని చెప్పారు. అంతేకాదు అసంఘటిత కార్మికుల కోసం ప్రధాన మంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో కొత్త పెన్షన్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువస్తున్నామన్నారు. అసంఘటిత కార్మికలు ఇకపై ప్రతీ నెల రూ.100 జమ చేస్తే 60 ఏళ్ల తరువాత వారిక ప్రతి నెల రూ.3 వేల పెన్షన్ అందించేనున్నామని తెలిపారు. ఈ పథకంతో అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు లబ్ది చేకూరుతుందని అన్నారు.

ఈ పథకం వర్తింపు పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంచుతున్నట్లు చెప్పారు. ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది. కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇక దేశంలోని ప్రజలు సుఖశాంతంగా వుండేందుకు కారణమైన జవాన్ల సంక్షేమాన్ని కూడా తమ ప్రభుత్వం కోరుకుంటుందని పియూష్ గోయల్ అన్నారు.

రక్షణ రంగానికి రూ.3లక్షల కోట్లు కేటాయిస్తున్నామని గోయల్ తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వన్‌ ర్యాంక్ వన్‌ పెన్షన్‌ కూడా అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. దేశ రక్షణలో సైనికుల త్యాగం నిరుపమానం అని చెప్పారు. ఇక ముద్ర యోజన పథకం ద్వారా రూ.7.23 లక్షల కోట్ల రుణాలను ఇచ్చామని మంత్రి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Interim budget  Union budget  piyush goel  PM Modi  indian economy  GDP  

Other Articles