Hindu Mahasabha leader shoots at Gandhi's effigy హిందూ మహాసభ నాయకురాలి దాష్టికం..

Hindu mahasabha leader shoots at mahatma gandhi s effigy to mark his death anniversary

Vijayadashami, United Provinces of Agra and Oudh, Nathuram Godse, mahatma gandhi, Hindu Mahasabha, Puja Shakun Pandey, assassination of Mahatma Gandhi, Shaurya Divas, yogi adityanath, politics

In an extremely provocative act, Hindu Mahasabha’s national secretary, Puja Shakun Pandey shot at an effigy of Mahatma Gandhi with a toy gun to mark his death anniversary and celebrated the day as ‘Shaurya Divas’ in Aligarh

మహాత్మునికి అవమానం.. హిందూ మహాసభ నాయకురాలి దాష్టికం..

Posted: 01/30/2019 07:26 PM IST
Hindu mahasabha leader shoots at mahatma gandhi s effigy to mark his death anniversary

జాతిపిత మహాత్మాగాంధీకి ఘోర అవమానం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో మహాత్ముడ్ని చంపిన గాడ్సేకు పూజలు చేసి.. జాతిపితను దారుణంగా అవమానించారు హిందూ మహాసభ ప్రతినిధులు. అలీఘర్‌లో హిందూమహాసభ జాతీయ కార్యదర్శి పూజా శకున్ పాండే.. దిష్టిబొమ్మకు గాంధీజీ ఫ్లెక్సీని తగిలించి.. తుపాకీతో కాలుస్తూ రాక్షసానందం పొందారు. తర్వాత గాడ్సే చిత్రపటానికి పూజలు చేసి నివాళులు అర్పించారు.

హిందూ మహాసభ గాంధీజి వర్థంతిని 'శౌర్య దివస్‌'గా జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుతూ గాడ్సే విగ్రహానికి పూల మాలలు వేస్తూ జాతిపితను దారుణంగా అవమానించారు. అంతేకాదు భారతదేశం నుంచి పాకిస్థాన్ విడిపోవడానికి.. పాకిస్థాన్ దేశంగా ఆవిర్భవించడానికి గాంధీజీ కారణమని గుడ్డిగా వాదిస్తున్నారు. జాతిపితను తుపాకీతో కాలుస్తున్న ఈ వీడియో కూడా వైరల్‌గా మారింది.

హిందూ మహాసభ తీరుపై నెటిజన్లతో పాటూ ప్రజలు మండిపడుతున్నారు. జాతిపితను దారుణంగా అవమానించిన హిందూ మహాసభ సభ్యలుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలని.. వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పించాలంటున్నారు. హిందూ మహాసభ గతంలో కూడా మహాత్మాగాంధీపై వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది. ఏకంగా గాడ్సేకు విగ్రహం కూడా ఏర్పాటు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahatma gandhi  Hindu Mahasabha  Puja Shakun Pandey  yogi adityanath  politics  

Other Articles