Tehseen Poonawalla shares pic of him hugging Hindu wife విమర్శల వలయంలో చిక్కకున్న కేంద్రమంత్రి హెగ్డే..

Break my hands tehseen poonawalla dares anantkumar hegde

Tehseen Poonawalla, Twitter, hindu, Dinesh Gundu Rao, dinesh wife Tabassum, Anantkumar Hegde, Tabassum on union minister, Tabassum on Ananth kumar Hegde, Tehseen Poonawalla dares ananth kumar hegde, politics

Tehseen Poonawalla posted a picture of himself hugging his ‘Hindu’ wife and dared Anantkumar with a message "do what you can. It's a dare sir!"

‘‘నా చేతులు విరుస్తావా..’’ కేంద్రమంత్రి హెగ్డేకు కాంగ్రెస్ నేత సవాల్.!

Posted: 01/29/2019 11:13 AM IST
Break my hands tehseen poonawalla dares anantkumar hegde

"హిందూ మహిళలపై చేయి వేసిన వారి చేతులు నరికేయాలి" అని కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఓ వైపు తీవ్రదుమారం రేగుతున్న క్రమంలోనే ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత తెహసీన్‌ పూనావాలా సవాల్ విసిరారు. తాను హిందూ మహిళపై చేతులు వేశానని, తన చేతులను నరికేస్తారా.? అంటూ తన భార్యతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, కేంద్రమంత్రికి సవాల్ విసిరారు.

‘‘నా చేతులు చూశారా.. ఎం చేస్తున్నాయో.. హిందూ మహిళ శరీరాన్ని తాకుతున్నాయి’’ అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో సవాల్ చేశారు. అంతేకాదు కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు సవాల్ విసురుతూ ఇప్పుడు మీ ఇష్టం మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ కామెంట్ కూడా పోస్టు చేశారు. దీంతో కర్ణాటక కాంగ్రెస్ నేత దినేష్ గుండారావుకు కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డేకు మధ్య రాజుకున్న వివాదంలోకి తెహసీన్‌ పూనావాలా చొరబడి సవాల్ విసరడంతో ఇది కొత్తమలుపు తీసుకుని మరింత దుమారానికి కారణమవుతుంది.

కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేశ్ గుండూరావు, ఓ ముస్లిం మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని రాజకీయంగా పరిగణిస్తూ.. ఓ హిందువుగా వుంటూ ఓ ముస్లిం మహిళ వెనుక పరిగెత్తిన వ్యక్తిగా గుండూరావును హెగ్డే అభివర్ణించడం తొలుత దుమారాన్ని కారణమైంది. ఈ క్రమంలో ఆయన హిందూ మహిళలపై ఇతరులు చేయి వేస్తే వాటిని నరికేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మహారాష్ట్ర కాంగ్రెస్ నేత తెహసీన్‌ పూనావాలా కేంద్రమంత్రికి సవాల్ విసిరారు.

కేంద్రమంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తప్పబట్టారు.  ప్రజల మధ్య ఇలాంటి వైషమ్యాలను పెంచిపోషించే నేతలకు రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, ఇక ఆయన కేంద్రమంత్రిగా ఎలా అర్హుడనికూడా ప్రశ్నించారు. తాజాగా దీనిపై గుండూరావు భార్య తబస్సుమ్‌ స్పందిస్తూ, తాను రాజకీయాల్లోలేని సాధారణ మహిళనని, ఒక వివాహిత మహిళ చీర వెనుక దాక్కొన్న హెగ్డే, రాజకీయాలు చేస్తున్నారని, దీన్ని ఆపివేయాలని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tehseen Poonawalla  Twitter  hindu  Dinesh Gundu Rao  Tabassum  Anantkumar Hegde  Politics  

Other Articles