Rahul Gandhi promises minimum income for the poor పేదలకు కనీస అదాయం: కాంగ్రెస్ సరికొత్త హామీ

Rahul gandhi says poor will get universal basic income if congress comes to power

Rahul Gandhi says poor will get universal basic income if Congress comes to power

After winning the 2019 Lok Sabha election, the Congress-led government will do what no other government has done. We will ensure universal basic income for the poor in the country, Rahul Gadhi said while speaking at a rally

పేదలకు కనీస అదాయం: కాంగ్రెస్ సరికొత్త హామీ

Posted: 01/28/2019 07:45 PM IST
Rahul gandhi says poor will get universal basic income if congress comes to power

సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోనియా గాంధీ రాజకీయ వారసుడిగా పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే తన సత్తా చాటిన రాహుల్ గాంధీ.. తాజాగా మరిన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆయన.. పేదలను ఆకర్షించేందుకు సంచలన ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే.. దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయాన్ని అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఛత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్ లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం.. ఆహార భద్రతా చట్టం లాంటి వాటితో ఇప్పటికే దేశంలోని పేదలకు కనీసం రోజుకో పూటతో అన్నం మాత్రం లభిస్తుంది. రూపాయికే బియ్యం, ఏడాదికి కనీసం వంద రోజుల పని కల్పనతో పేదలు అకలి బాధలకు కొంత దూరమయ్యారనే చెప్పవచ్చు. అయితే ఇలాంటి పథకాన్ని మరోమారు టార్గెట్ గా చేసుకున్న రాహుల్ తాజాగా తాము అధికారంలోకి వస్తే మరో సంచలన పథకాన్ని అమల్లోకి తీసుకోస్తామని తెలిపారు.

కాంగ్రెస్ గతంలో అనేక చారిత్రక నిర్ణయాలను తీసుకుందన్న రాహుల్.. 2019లో అధికారంలోకి వస్తే.. మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ పథకమే పేదలకు కనీస అదాయ భరోసా పథకం. ఈ పథకంతో దేశంలో పేదలందరూ కనీస ఆదాయం పొందనున్నారని చెప్పారు. ఆకలి, పేదరికం లేని నవభారత నిర్మాణమే తమ లక్ష్యమని రాహుల్ ప్రకటించారు. ఈ పథకం ప్రకారం నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో అమల్లోని పథకం భారత్ తో తాము అధికారంలోకి వస్తే అమల్లోకి వస్తుందని రాహుల్ ప్రకటించారు. కోట్లాది మంది ఆకలి, పేదరికంతో అలమటిస్తుంటే నవభారతాన్ని నిర్మించలేమని రాహుల్ తెలిపారు. పేదరిక నిర్మూలనకు ఈ పథకం దోహదం చేస్తుందని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles