Telangana joins nation in celebrating 70th Republic Day పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Telangana joins nation in celebrating 70th republic day

Republic day, 70th Republic day, republic day-2019, republic day celebrations, republic day celebrations telangana, republic day celebrations, republic day governor, republic day narasimhan, Telangana government

Governor ESL Narasimhan raised the national flag and took the salute from the colourful ceremonial parade comprising the contingents from the army, Indian Air Force, armed police, brass band and NCC at parade grounds in Secunderabad of Telangana

పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

Posted: 01/26/2019 10:58 AM IST
Telangana joins nation in celebrating 70th republic day

దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ఇవాళ ఒక సఫల రాష్ట్రంగా, జాతి నిర్మాణంలో చక్కటి పాత్ర పోషిస్తుందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. గత నాలుగున్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చాయన్నారు. సీఎం కెసీఆర్ నేతృత్వంలో ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం అన్నిరంగాలలో పునర్నిర్మాణ ప్రక్రియను ఉజ్వలంగా చేపట్టిందని కొనియాడారు.. ఒకవైపు దృఢమైన నాయకత్వాన్ని అందిస్తూ మరోవైపు రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పిందన్నారు.

ప్రగతి పథంలో ప్రభుత్వం.. రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతిని, సామరస్యాన్ని నెలకొల్పుతూ అన్నివర్గాల ఆదరాభిమానాలను చూరగొన్నదంటూ నరసింహన్ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకులకు హాజరైన ఆయన రాష్ట్ర ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశస్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహనీయులను, త్యాగమూర్తులను, రాజ్యాంగ నిర్మాతలను స్మరించారు.

వారిని స్మరించుకోవడం మన విధి అన్నారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. అనతికాలంలోనే బాలారిష్టాలను అధిగమించి అద్భుత విజయాలను సాధించిందన్నారు. ప్రజాసంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయన్నారు.

రెండవసారి అధికార బాధ్యతలను చేపట్టిన ప్రభుత్వం తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం అవుతుందన్నారు. ఇవాళ రాష్ట్రంలో రూ. 40 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వ పరిపాలనని సంక్షేమంలో స్వర్ణయుగంగా పేర్కొనటం సముచితమన్నారు. దేశంలో మరే రాష్ట్రం కూడా, సంక్షేమం కోసం, ఇంత పెద్దఎత్తున నిధులను కేటాయించటం లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Republic day  parade grouns  Governor  ESL Narasimhan  Telangana Government  

Other Articles