pawan kalyan focus again on uttarandhra ఉత్తరాంధ్రపై పవన్ ఫోకస్.. జనసేన బలోపేతమే టార్గెట్

Pawan kalyan 3 day uttarandhra tour from 23rd to strengthen janasena

pawan kalyan, janasena, Pawan Kalyan uttarandhra, paderu, srikakulam, vizianagaram, vishakapatnam, andhra pradesh, YS Jagan, CM Chandrababu, politics

JanaSena party chief Pawan Kalyan again focusing on Uttarandhra districts to strengthen his party after YS Jagan padayatra conclusion, and state government aid for titli cyclone victims.

మళ్లీ ఉత్తరాంధ్రపై పవన్ ఫోకస్.. జనసేన బలోపేతమే టార్గెట్

Posted: 01/22/2019 02:29 PM IST
Pawan kalyan 3 day uttarandhra tour from 23rd to strengthen janasena

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలతో పాటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పుడే అన్ని పార్టీలు తమ ప్రచార వాడి-వేడి మొదలెట్టాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి ఇప్పటి నుంచే కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాయి. ఈ రెండు మూడు నెలలు ప్రజల్లోనే ఉంటూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

అయితే గత ఎన్నికలకు బిన్నంగా ఈ సారి ఎన్నికల బరిలో పలు కొత్త పార్టీలు కూడా రానున్నాయి. గత ఎన్నికలలో బీజేపి, టీడీపీలకు మద్దతు పలికిన జనసేన పార్టీ.. 2019లో ఎన్నికలలో మాత్రం తమ సత్తా చాటేందుకు అన్ని అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇక మిత్రపక్షం అంటూనే ప్రత్యేకహాదా విషయంలో మాట నిలబెట్టుకోలేదని విమర్శలను ఎదుర్కోంటున్న బీజేపి కూడా ఈ సారి ఒంటరిపోరుతో తన ఉనికి చాటుకునేందుకు సిద్దమవుంతుంది.

ఉత్తరాంధ్ర పోరాట యాత్రతో వెనకబడిన జిల్లాలను, జిల్లా వాసులు ఎదుర్కోంటున్న సమస్యలను ఏకరువు పెట్టడంతో పాటు ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం తన వంతుగా కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి సమస్యలను అర్థం చేసుకునేందుకు పర్యటించారు. అయితే సమస్యలను అథ్యయనం చేసుకున్న పవన్.. మళ్లీ అక్కడి నుంచి మరోమారు ఆ ప్రాంత సమస్యలను ఎలా పరిష్కరించేది చెప్పేందుకు ప్రజల్లోకి వెళ్తున్నరని సమాచారం.

ఇప్పటికే జిల్లా వారీగా పర్యటనలు చేసిన పవన్.. సమీక్షలు కూడా నిర్వహించారు. ఇక ప్రజా క్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తన పోరాట యాత్ర తరువాత తిత్లీ తుఫాను రావడం.. బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కేడ వుంటూ సాయం అందించడం.. ఆ తరువాత విపక్షనేత జగన్ కూడా తన పాదయాత్రను అక్కడే ముగించిన క్రమంలో తన పార్టీ యువతకు, నూతన జోష్ ను అందించేందుకు పవన్ మరోమూడు రోజుల పాటు ఉత్తరాంద్ర పర్యటనను చేయనున్నారు.జ

జనసేనాని రేపటి నుంచి మూడు రోజుల పాటు పర్యటకు సిద్ధమయ్యారు. బహిరంగ సభలతో పాటూ పార్టీ పరిస్థితిపై మరోమారు సమీక్ష చేయబోతున్నారు. విశాఖకు చేరుకోనున్న జనసేనాని.. పాడేరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. గిరిజనుల సమస్యలపై స్పదించనున్నారు. 24న మూడు జిల్లాల పార్టీ నేతలతో సమావేశమవుతారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతంపై నేతలతో చర్చిస్తారు. 25న విశాఖలో లెఫ్ట్ పార్టీల జాతీయ నేతలతో భేటీకానున్నారు. ఈ సమావేంలో ఎన్నికల వ్యూహాలపై, సీట్ల సర్దుబాట్లపై వామపక్ష నేతలతో పవన్ చర్చిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  paderu  srikakulam  vishakapatnam  andhra pradesh  politics  

Other Articles