Hyper Aadhi attacked by Jagan Fans జబర్దస్త్ హైపర్ ఆది కారుపై వైసీపీ నేతల దాడి.!

Jabardasth comedian hyper aadhi attacked by jagan fans

ycp activist ruckus at janasena meeting, hyper adi car damaged, hyder adi, janasena, chitoor, janasena meeting, hyper adi, pawan kalyan, ysrcp, ys jagan, andhra pradesh politics. andhra politics. latest politics, crime

Jana Sena Party and YSRCP activists clashed at a meeting, held at Kanduru of Somala mandal in Chittoor, Jana Sena supporter and comedian, Hyper Aadhi who while attending the meeting ycp actvists stopped his car and damaged his car window glasses.

జబర్దస్త్ హైపర్ ఆది కారుపై వైసీపీ నేతల దాడి.!

Posted: 01/21/2019 11:46 AM IST
Jabardasth comedian hyper aadhi attacked by jagan fans

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులరిటీ సంపాదించిన నటుడు హైపర్ అది కారుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. అయన అశువుగా పండించే హాస్యం కోసం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మరీ ముఖ్యంగా యువత వేచిచేస్తారని చెప్పడం అతిశయోక్తి కాదు. అలాంటి హైపర్ తన అభిమాన నటుడు, నాయకుడు పవన్ కల్యాణ్ అని ఇప్పటికే పలుమార్లు తన షోల ద్వారా స్పష్టతనిచ్చాడు. సరిగ్గా ఎన్నికల సమయం ముంచుకొస్తున్న క్రమంలో ఆయన తన కెరీర్ ను కూడా పక్కన బెట్టి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తరుపున ప్రచారం చేస్తూన్నారు.

ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా కందూరు మండలానికి వెళ్లిన హైపర్ అది అక్కడ స్థానిక జనసేన కార్యకర్తలు ఏర్పాటు సమావేశంలో పాల్గోనేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమానికి హైపర్ ఆదితో పాటు జనసేన నాయకుడు సుంకర దిలీప్, హరిప్రసాద్ తదితరులు హాజరయ్యారు. వేదికపైనున్న జనసేన నేతలు అటు అధికారపక్షంతో పాటు ఇటు ప్రతిపక్షంపై కూడా విమర్శలు చేశారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై విమర్శలు సంధించడంతో వాటిని జీర్ణించుకోలేకపోయిన కార్యకర్తలు సభలోకి ప్రవేశించి జై జగన్ అని నినాదాలు చేశారు.

సభావేదిక వద్ద గంధరగోళం నెలకొన్న సమయంలో అలస్యంగా హైపర్ అది సభాస్థలికి చేరకున్నారు. దీంతో వైసీపి కార్యకర్తలు ఆయన కారును అడ్డగించారు. కారును కూడా ధ్వంసం చేశారు. దీంతో జనసేన కార్యకర్తలు రక్షణ వలయంగా ఏర్పడి ఆదిని వేదికపైకి తీసుకెళ్లారు. ఆ తరువాత హైపర్ అది తన ప్రసంగాన్ని ప్రారంభించగానే.. వైసీపీ నేతల్లో వణుకు పుట్టింది. ఆయన సైటర్లతో తమ పార్టీకి ఎక్కడ మైనస్ జరుగుతుందోనని భావించిన కార్యకర్తలు అది ప్రసంగిస్తుండగా వేదికపైకి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఒకరిని ఒకరు తోసుకోవడం, కుర్చీలు విసిరేసుకోవడం జరిగింది. ఈ గందరగోళం కారణంగా హైపర్ ఆది మధ్యలోనే తన ప్రసంగాన్ని నిలిపేసి వెనుదిరగాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో జనసేనాని పవన్ కల్యాణ్ జగన‌ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య ఇలాంటి వాతావరణం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో..అక్క‌డ ఉన్న పోలీసులు ఆది, మరికొందరు జనసేన నేతలను మరో మార్గం నుంచి తిరుపతికి పంపారు.

కాగా అంతకుముందు ప్రసంగించిన హైపర్ అది.. ఎన్నిక‌లు జ‌రిగే ఈ కాలంలో జ‌న‌సేన పై దాడులు చేసి గంద‌ర‌గోళం సృష్టించాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నాలు చేస్తుంటార‌ని.. వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఆది సూచించారు. కులపిచ్చితో కొందరు ఓట్లు వేస్తున్నారని, కానీ పవన్‌లాంటి నిస్వార్థ నేతను ఎన్నుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పవన్‌ కల్యాణ్ కు డబ్బు, పదవి పిచ్చిలేదని, కేవలం ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని ఆది స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyder adi  janasena  chitoor  janasena  pawan kalyan  ysrcp  ys jagan  andhra pradesh politics. crime  

Other Articles