Pranksters spreading fake news of Trump's departure అగ్రరాజ్యంలో కలకలం రేపిన వార్త.. ట్రంప్ రాజీనామా..!

Trump resigns fake washington post edition takes us by storm

fake Washington post, Washington post fake edition, fake newspaper Washington Post, fake copy Washington Post says Donald trump has resigned, Donald Trump resigns says fake edition of Washington Post, Fake copy of The Washington Post in US, Social media fake Washington Post, Washington post, fake edition, US, America, Donald trump, resigns, White House, Social media, Politics

People in Washington DC were in for a big surprise as US President Donald Trump has resigned, screamed a front-page six-column headline in The Washington Post. It read: 'UNPRESIDENTED Trump hastily departs White House, ending crisis'.

ITEMVIDEOS: అగ్రరాజ్యంలో కలకలం రేపిన వార్త.. ట్రంప్ రాజీనామా..!

Posted: 01/18/2019 10:30 AM IST
Trump resigns fake washington post edition takes us by storm

అగ్రరాజ్యవాసులను తీవ్ర కలకలానికి గురిచేసిన వార్త అది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన పదవికి రాజీనామా చేశారని ప్రముఖ దినపత్రిక ద వాషింగ్టన్ పోస్టు సంచలన వార్తను పతాక శీర్షికన ప్రచురించింది. అంతేకాదు ట్రంప్ రాజీనామాతో ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయని.. అమెరికా నూతన అధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని..’ కూడా అదే పత్రికలో తొలిపేజీలోనే కథనాలు కూడా వెలువడ్డాయి.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏంటీ..? అధ్యక్ష పదవికి రాజీనామా చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? ఇదే వార్త అమెరీకన్లను కూడా అశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్తను వాషింగ్టన్ వీధుల్లో ‘ప్రత్యేక సంచిక’ పేరిట ప్రజలకు ఉచితంగా పత్రికను కొందరు పంచిపెట్టారు. ‘ద వాషింగ్టన్ పోస్ట్’ ప్రచురించినట్లుగా ఉన్న ఆ పత్రికలో ‘ట్రంప్ రాజీనామా..’.. అంటూ ఓ పెద్ద కథనాన్ని రాసింది. మొదటిపేజీ పైభాగంలో దిగాలుగా ఉన్నట్లుగా ఉన్న ట్రంప్ అతి పెద్ద ఫొటోను ఉంచి.. ఈ వార్తను ప్రచురించింది.

‘ట్రంప్ శకం ముగియడంతో ప్రపంచ వ్యాప్తంగా మొదలయిన సంబరాలు..’ అంటూ మరో వార్తను రాసింది. ఈ సంచికకు ‘2019వ సంవత్సరం మే 1వ తారీఖు’ ను డేట్ లైన్ గా ఉంచింది. శ్వేతసౌధంకు దగ్గరలోని ప్రాంతాలతోపాటు ఆయా పరిసర ప్రాంతాల్లో ఈ సంచికను ఉచితంగా కొందరు పంచిపెట్టారు. కాగా ఈ సంచికపై వాషింగ్టన్ పోస్ట్ స్పందించింది. దీన్ని ఫేక్ ఎడిషన్ అంటూ కొట్టిపారేసింది. దీంతో తమకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చిచెప్పింది.

‘వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లో మా పత్రిక పేరుతో కొందరు నకిలీ సంచికలను పంచిపెడుతున్నారు. మాపై బురదజల్లడానికి మమ్మల్ని అనుకరిస్తున్న ఓ వెబ్‌సైట్ చేస్తున్న నీతిమాలిన ప్రయత్నం ఇది. దీన్ని మేము సీరియస్‌గా తీసుకుంటున్నాం..’ అంటూ వాషింగ్టన్ పోస్ట్ ఓ ట్వీట్ చేసింది. ఆ నకిలీ పత్రికలో ఉన్న కథనం ప్రకారం.. 2019వ సంవత్సరం ఏప్రిల్ 30న ట్రంప్ వైట్ హౌస్ ను వీడారని పేర్కోంది.

అంతేకాదు ‘ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా గురించి అధికారిక ప్రకటనను ట్రంప్ ఏమీ ఇవ్వలేదు. తాను కూర్చునే టేబుల్ సొరుగులో ఓ నాప్‌కిన్‌పై ట్రంప్ తన రాజీనామా మెసేజ్ ను రాసి ఉంచారు. వాషింగ్టన్ నుంచి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మిత్ర రాజ్యాలు సమావేశ స్థలమైన  యాల్ట్రాకు వెళ్లారు..’ అంటూ మే ఒకటో తారీఖున వార్తను ప్రచురించింది. పూర్తిగా ట్రంప్ వ్యతిరేక వార్తలతో నిండి ఉన్న ఈ నకిలీ సంచికను చదివిన అమెరికన్లు.. సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Washington post  fake edition  US  America  Donald trump  resigns  White House  Social media  Politics  

Other Articles