Petrol and diesel prices hiked again మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

Petrol diesel prices jump by about rs 2 this year

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

With the rupee dropping 2% this year against the US dollar and crude oil rates surging above $60 per barrel, petrol and diesel prices have shot up by about Rs 2 so far this year.

రూ.2 మేర పెరిగిన ఇంధన ధరలు..

Posted: 01/17/2019 11:17 AM IST
Petrol diesel prices jump by about rs 2 this year

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత ఏడాది అల్ టైం హై రికార్డు ధరలను అందుకున్న ఇంధన ధరలు.. క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత క్రమంగా ఇంధన ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇక కొత్త ఏడాదిలో ఇంధర ధరలు సుమారుగా రెండు రూపాయల మేర పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గముఖం పట్టినా.. డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గిన నేపథ్యంలో ఇంధర ధరలపై ప్రభావాన్ని చాటుతుంది.

కొ్త్త ఏడాదిలో సుమారు 2శాతం మేర తగ్గిన రూపాయి తన పతనాన్ని ఇంధనంపై శాసించడంతో అవి.. దేశంలోని నిత్యావసర సరుకుల ధరలను ప్రభావితం చేస్తున్నాయి. కాగా జనవరిలోని 17 రోజుల్లో 9 సార్లు పెరిగిన డీజిల్ ధర.. పెట్రోల్ కన్నా అధిక సార్లు పెరిగి నిత్యావసర సరుకుల ధరలపై ప్రభావాన్ని చాటుతుంది. కాగా ఇక న్యూఇయర్ లో పెట్రోల్ ధర కూడా 8 సార్లు పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గిన దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతూ రావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ ‌కు 61.07 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 52.07 డాలర్ల వద్ద ఉంది. తాజా ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 14 పైసలు పెరిగింది. అదే సమయంలో లీటరు డీజిల్ ధర 19 పైసలు ఎగసింది.

దీంతో పెట్రోల్ ధర రూ.70.47కి చేరితే.. డీజిల్ ధర రూ.64.78కి పెరిగింది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర రూ.76.11 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.67.82 వద్ద కొనసాగుతోంది. ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.74.76 వద్ద ఉండగా.. డీజిల్ ధర రూ.70.42 వద్ద కొనసాగుతోంది. ఏపీ రాజధాని అమరావతిలో పెట్రోల్‌ రూ.74.55 వద్ద, డీజిల్‌ రూ.69.85 వద్ద కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles